గుప్పెడంతమనసు మే 17 ఎపిసోడ్
శైలేంద్ర కుట్రను బయటపెట్టబోయి అందరి ముందూ అవమానం ఎదుర్కొంటుంది జగతి. రిషి కూడా సీరియస్ అవడంతో.. జగతి తరఫున దేవయాని, శైలేంద్రలకు వసుధార క్షమాపణలు చెబుతుంది. మహేంద్ర కూడా ఫణీంద్ర ఫ్యామిలీని క్షమాపణలు చెప్పేసి వెళ్లిపోతాడు. అందరూ ఎవరికి వారే వెళ్లిపోతారు..జగతి, దేవయాని, ఫణీంద్ర మిగులుతారు. ఏంటి జగతి అంటూ దేవయాని ఆడుకుంటుంది..అసలు మా ఉద్దేశం రిషిని చంపడం కాదు నిన్ను చంపడం..రిషి మనసులో నిన్ను చంపడం అనగానే జగతి షాక్ అవుతుంది. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు కొద్దిసేపు ఇక్కడే కూర్చుని ఏడువు అనేసి వెళ్లిపోతారు. జగతి ఏడుస్తూ ఉంటుంది. పెద్దమ్మ నిజంగా విషం పెట్టినాకానీ తినేస్తానన్న రిషి మాటలు తలుచుకుంటుంది.
Also Read: శుక్రుడు-కుజుడి సంచారం ఈ 4రాశులవారికి అస్సలు బాలేదు!
మరోవైపు రిషి-వసుధార ఇద్దరూ అమ్మవారి దగ్గరకు వెళతారు. సంతోషంగా జరుపుకోవాల్సిన నిశ్చితార్థం భయభయంగా జరిగింది. నువ్వే మా బంధాన్ని నిలబెట్టాలని అమ్మవారిని వేడుకుంటుంది వసుధార. నీ సమక్షంలో మా బంధం ముడిపడింది...ఆ బంధం నిశ్చితార్థం వరకూ వచ్చింది వసుధారకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే శక్తిసామర్థ్యాలు ఇవ్వమని వేడుకుంటాడు. రిషి బాగుండాలని వసు...వసు బాగుండాలని రిషి కోరుకుంటారు. వసు: మీరు బావుండాలి సార్..ఇంకో పదిమంది బావుంటారు..ఈ మధ్య మీ చుట్టూ ఏవేవో జరుగుతోన్నాయి. ఊహించని సంఘటనలు, ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమోషనల్ అవుతుంది
రిషి:ఇంకా నీ మనసులో భయం, ఆందోళన పోలేదు అనుకుంటా. చిన్న చిన్న వాటికి నువ్వు, జగతి మేడం ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు.
ఇవి సంతోషంగా ఉండే క్షణాలు..నువ్వు సంతోషంగా ఉండు..
వసు: సరే అంటుంది..
ఇద్దరూ కలసి అమ్మవారికి దండవేద్దామని వెళతారు..ముందున్న రాయి తగిలి ఆ దండ ఇద్దరి మెడలో పడుతుంది. చూశావా ఆ అమ్మవారు మన ఇద్దరినీ ఒకే దండలో చేర్చింది. ఎప్పటికీ విడిపోము అనడానికి ఇది సంకేతమని రిషి అనడంతో వసుధార సంతోషపడుతుంది.
Also Read: పెళ్ళాన్ని చూసి ఫ్లాట్ అయిపోయిన రాజ్- కావ్య మన పెళ్లి జరగనివ్వదని స్వప్నని నమ్మించిన రాహుల్
జ్యూస్‌లో విషం కలిపిన విషయాన్ని జగతికి చెప్పినందుకు ధరణిపై శైలేంద్ర, దేవయాని విరుచుకుపడతారు. మనింట్లో బిస్కెట్లు తిని పక్కింటివాళ్లకి మంచి చేయాలి అనుకునే కుక్కల్ని ధరణి అంటారు..నిజానికి నువ్వు చెప్పడం వల్లే పిన్ని హడావుడి చేసింది..చివర్లో జ్యూస్ లో విషం లేదనితెలిసేసరికి అందరి ముందూ పిన్ని, నువ్వు దద్దమ్మల్లా నిలబడ్డారు. ముందు ముందు తోకజాడిస్తే నేను సహించను నా రియాక్షన్ సీరియస్‌గా ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకో అంటూ ధరణికి శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు.
మరోవైపు ఏడుస్తున్న జగతిని మహేంద్ర ఓదార్చుతాడు.
మహేంద్ర: నీ సమస్య ఏంటో చెప్పవు..ఏమైనా అంటే కన్నీళ్లు పెట్టుకుంటావ్.. ఏమైనా ఉంటే చెప్పు అంటాడు. కానీ జగతి మాత్రం ఏమీ మాట్లాడదు. శైలేంద్రని, వదినని ఎందుకు అనుమానిస్తున్నావ్..ఈ రోజు జ్యూస్ లో ఏదో కలిపావని అందరి ముందూ బ్యాడ్ అయిపోయావు నాకు బాధేసింది జగతి
జగతి: నావన్నీ భ్రమలనుకుంటున్నావా..అక్కయ్య గురించి నీకు తెలియదా
మహేంద్ర: వదినగారు కక్షలన్నీ నీపైనే..రిషిని ఏమీ చేయరు... నువ్వు కోరుకున్నట్టే రిషి-వసుధార హ్యాపీగా ఉంటారు.. నేను ఢిల్లీ వెళ్తాను..మెడికల్ కాలేజీ పనిపై
జగతి: ఈ సమయంలో నన్ను వదిలేసి వెళ్లొద్దు
మహేంద్ర: నువ్వు జాగ్రత్తగా ఉండాలి..లేనిపోనివి ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దు.
వసుధార..తల్లిదండ్రులు కారులో వెళుతూ..జరిగినదంతా ఆలోచిస్తారు..అసలు జగతి మేడం ఎందుకు టెన్షన్ పడ్డారని చక్రపాణి అంటే అదే అర్థంకావడం లేదంటుంది సుమిత్ర. మనం వచ్చినప్పటి నుంచీ జగతి మేడం టెన్షన్ గా ఉన్నారు, ఏదో ఆలోచనలో ఉన్నారు, వసుధారని అడిగినా ఏమీ లేదంది..ఈ టైమ్ లో మనం వాళ్ల దగ్గర ఉంటే బావుంటుందని చక్రపాణి అంటే..మనం ఉంటే ఇంకొంచెం గొడవ జరుగుతుందని సర్దిచెబుతుంది సుమిత్ర.
జగతి దగ్గరకు వెళ్లిన దేవయాని-శైలేంద్ర ఇద్దరూ మళ్లీ వేధింపులు మొదలెడతారు. రిషి-వసుధార ఇంటికి వస్తారో రారో అని భయపడుతున్నారా అంటూ జగతి వద్దన్నా కానీ కాల్ చేస్తానంటాడు శైలేంద్ర. ధరణిని పిలిచి ఫోన్ తెమ్మని చెబుతాడు. అటు రిషి-వసుధార ఇద్దరూ వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో కాల్ రావడంతో అసలు ఏ శబ్ధం ఉండకూడదు అనుకున్నాం..కానీ ఈ ఫోన్ కాల్స్ డిస్టబ్ చేస్తున్నాయంటూ కాల్ కట్ చేస్తాడు. కాసేపు ఇక్కడే ఉందాం అనడంతో సరే అంటుంది వసుధార. అయినప్పటికీ శైలేంద్ర మళ్లీ మళ్లీ కాల్ చేస్తూనే ఉంటాడు...ఎపిసోడ్ ముగిసింది..