కావ్య హడావుడిగా వంట చేసుకుని బాక్స్ సర్దుకుని బయల్దేరుతుంటే రుద్రాణి చూస్తుంది. పాపం కావ్య రాజ్ కోసం చాలా కష్టపడుతుంది, ఆయన ఎంత ద్వేషిస్తున్నా ఈవిడ మాత్రం ప్రేమ ఒలకబోస్తుంది. వెళ్ళు నువ్వు వచ్చే లోపు నీకోసం, మీ అత్త కోసం మంచి గిఫ్ట్ రెడీ చేసి పెడతానని అనుకుంటుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వస్తే ఇంత ఆకలిగా ఉంటుందా అని అనుకుంటూ ఉండగా కావ్య అప్పుడే ఆఫీసుకి వస్తుంది. లోపలికి వెళ్లబోతుంటే సెక్యూరిటీ అడ్డుపడతాడు. అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. నేను మీ ఎండీ రాజ్ గారి వైఫ్ ని అనేసరికి సెక్యూరిటీ నవ్వుతుంది. మా సార్ భార్య ముసుగు వేసుకుని పెళ్లి చేసుకుందని చెప్తాడు. మీరెంటి మా సర్ భార్య ఏంటి? ఆటోలో ఎందుకు వచ్చారు. మీరు నిజంగా మా సార్ భార్య అంటే ఫోన్ చేసి చెప్పించమని అడుగుతారు. ఫోన్ లేడని కావ్య అనేసరికి మళ్ళీ నవ్వుతారు. అయినా మేము నమ్మం ఇలాంటి చీరలు మా సార్ భార్య కట్టడం ఏంటి? మా బస్తీలో ఆడవాళ్ళు కడతారని హేళన చేసి మాట్లాడతారు.
Also Read: అభిమన్యుకి ఫ్యూజులు ఎగిరిపోయే షాకిచ్చిన మాళవిక- ఒక్కటైన అన్నాచెల్లెలు
రాజ్ కోపంగా బయటకి వచ్చి వాళ్ళకి నాలుగు చీవాట్లు పెడతాడు. వెంటనే తన అవతారం చూసి షాపింగ్ కి తీసుకుని వెళతాడు. డ్రైవర్ మేడమ్ మీరు పెసరట్టు ఉప్మా చేశారా అని అడుగుతాడు. అసలే ఆకలితో చచ్చిపోతుంటే ఈ టిఫిన్ స్మెల్ టెంప్ట్ చేసేస్తుందని రాజ్ మనసులో అనుకుంటాడు. మీరు తినకుండా వస్తే బాధగా ఉందని అంటుంది. షాపింగ్ మాల్ దగ్గరకి వెళ్ళి ఇద్దరూ లోపలికి వెళ్ళకుండా చిటపటలాడుతుంటారు. అప్పుడే మల్లెపూలు ఆమె వచ్చి ఇంత అందమైన అమ్మగారికి పూలు లేకపోతే బాగోదని తిట్టేసి పంపిస్తాడు. లోపలికి రమ్మని కావ్య చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కుని వెళ్తుంటే కానిస్టేబుల్ వచ్చి ఏంటి ఏం చేస్తున్నావ్ అని రాజ్ ని తిడతాడు. రోడ్డు మీద ఆడపిల్లని లాక్కుని వెళ్తున్నావ్ నడువు పోలీస్ స్టేషన్ కి అంటాడు. ఈవిడ నా భార్య అంటాడు కానీ కానిస్టేబుల్ మాత్రం నమ్మడు ఈ ముక్క ఆ అమ్మాయితో చెప్పిస్తే నమ్ముతానని చెప్తాడు. కావ్య కావాలని ఏడుస్తున్నట్టు నటిస్తుంది.
Also Read: రాజ్యలక్ష్మికి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన దివ్య- కోర్టులో ఆవేశపడిన నందు దోషిగా తేలుతాడా?
ఒప్పుకోవే అని రాజ్ అంటుంటే మల్లెపూలు ఆమె వచ్చి నేను ఒప్పుకోను ఈ అమ్మాయి ఇందాక తన భార్య కాదని అన్నాడని చెప్తుంది. సందు దొరికిందని కావ్య ఆడుకుంటుంది. సోరి చెప్పండి అప్పుడు ఒప్పుకుంటానని అనేసరికి గట్టిగా సోరి అంటాడు. మా ఆయనే అని ఒప్పుకునేసరికి కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు. షాపులో వెళ్ళిన తర్వాత చీరలు చూపించమని అడుగుతాడు. ఎవరికీ మీ అమ్మగారికా అంటుంది కాదు నీకే అంటాడు. వామ్మో అని గట్టిగా అరుస్తుంది. ఇది కల కాదు నిజమే, ఇంత అర్జంట్ గా చీరలు కొనిపెట్టడం ఏంటని అడుగుతుంది. భార్య కోసం చీర సెలెక్ట్ చేస్తాడు. అది ట్రైల్ వేసుకుని వచ్చేసరికి తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కాస్ట్లీ చీరలు కట్టుకుని రమ్మని చెప్తాడు. రాజ్ షాపింగ్ చేసి బయటకి వచ్చేటప్పటికి స్వప్న అక్కడ ఉంటుంది. వాళ్ళని రాహుల్ చూసి రాజ్ కంట పడకుండా తనని తప్పించేస్తాడు.