చిత్ర, వసంత్ సంగీత్ వేడుకను వేద క్యాన్సిల్ చేస్తుంది. దీంతో అందరూ ఒకచోట కూర్చుని సరదాగా మాట్లాడుకుంటారు. ఖుషి బాల్ ఎవరికైతే వేస్తుందో వాళ్ళు మంచి మాట చెప్పాలని అంటారు. మొదటగా వేదకి ఛాన్స్ వస్తుంది. మగాళ్లు వంద ఆలోచిస్తారు కానీ ఆడది మాత్రం భర్త గురించి ఆలోచించాలి. అప్పుడే జీవితం ఎన్నోన్నో జన్మలబంధంలా ఉంటుందని చెప్తుంది. ఆ తర్వాత సులోచన వంతు. ఆడపిల్ల అన్నాక ఏదో ఒకరోజు గడప దాటక తప్పదు పుట్టింట్లో మాట పడదు, అత్తింట్లో మాట దాటదు. మన నడవడిక బట్టి ఆ ఇంటి పరువు, విలువ నిలబడి ఉంటుందని అంటుంది. తృప్తి వల్ల సంతోషం, వినడం వల్ల ప్రసన్నత, ఇవ్వడం వల్ల ప్రేమ.. ఈ మూడు కలిపితే వేద అని యష్ పెళ్ళాన్ని ఆకాశానికి ఎత్తేస్తాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆదిత్య వస్తాడు. తనని చూసి మాలిని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.


Also Read: రాజ్యలక్ష్మికి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన దివ్య- కోర్టులో ఆవేశపడిన నందు దోషిగా తేలుతాడా?


కళ్ళెదురుగా పెరగాల్సిన నా మనవడు అందరికీ దూరంగా శిక్ష అనుభవిస్తా పెరుగుతున్నాడని ఏడుస్తుంది. నాన్న ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చి కలుస్తూ ఉంటారు, మీ అందరి ఫోటోస్, వీడియోలు చూపిస్తూ ఉంటారని ఆదిత్య చెప్తాడు. లాస్ట్ వీక్ నాన్న, వేద ఆంటీ వచ్చి కలిశారని అంటాడు. మాళవిక షాకింగ్ గా నిజంగా వచ్చారా అంటుంది. ఆదిత్య దగ్గరకి రాగానే ప్రేమగా నుదుటి మీద యష్ ముద్దు పెడతాడు. ఖుషి ఆదిత్య దగ్గరకి వెళ్ళడానికి భయపడుతుంటే వేద పంపిస్తుంది. పిల్లలిద్దరినీ చూసి యష్ కడుపు నిండిపోతుంది. ఆదిత్యలో చాలా మార్పు వచ్చిందని మాలిని సంతోషపడుతుంది. ఆదిత్య మాళవిక దగ్గరకి వచ్చి ఆకలేస్తుందని అడుగుతాడు. గెస్ట్ లు వస్తున్నారు రిసీవ్ చేసుకుని వచ్చి మళ్ళీ పెడతానని వెళ్ళిపోతుంది. వేద వచ్చి ఆకలిగా ఉందని అన్నావ్ కదా నీకు, ఖుషికి భోజనం పెడతానని చెప్తుంది.


ఖుషి ఆకలిగా ఉందని ఫుడ్ తీసుకురమ్మని చెప్తుంది. వేద అన్నం తీసుకొచ్చి ఇస్తే ఖుషి అన్నయ్యకి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం చూసి యష్ ఎమోషనల్ అవుతాడు. థాంక్స్ వేద నువ్వు ఆరోజు ఇచ్చిన సలహా వల్లే దారి తప్పిన నా కొడుకు మంచి బుద్ధి నేర్చుకున్నాడని యష్ అంటాడు. మీ పిల్లలు అని వేరు చేయకండి వాళ్ళిద్దరూ మన పిల్లలే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని వేద కోరుకుంటుంది. కొద్ది రోజులు ఆదిత్య మనదగ్గరే ఉంటాడని చెప్పి ఇంటికి తీసుకువెళ్దామని వేద యష్ కి ఐడియా ఇస్తుంది. యష్ వచ్చి మాళవికని అడుగుతాడు. ఖుషిని మాకు దూరం చేసినట్టు ఆదిత్యని కూడా దూరం చేద్దామని ప్లాన్ చేస్తున్నారా అని మాళవిక మండిపడుతుంది.


యష్: మన మధ్య ఉన్న పంతాలు పక్కన పెట్టి పిల్లల గురించి ఆలోచించు. నువ్వు అభిమన్యుని పెళ్లి చేసుకుంటున్నావ్ నీకు భర్త మాత్రమే ఆదిత్యకి ఎటువంటి సంబంధం లేదు. మీకు ప్రైవసీ కావాలి అందుకే వాడిని ఇంటికి తీసుకెళ్తాను. అభి క్యారెక్టర్ మీద ఎవరికీ మంచి అభిప్రాయం లేదు ఆదిత్య ఇక్కడ ఉండటం మంచిది కాదు


Also Read: కీలక మలుపు, ఆదర్శ్ తో ముకుంద విడాకులు- ఉంగరం విసిరికొట్టిన మురారీ


మాళవిక: నువ్వు ఎన్ని చెప్పినా ఆదిత్యని వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఖుషి కంటే కూడా ఆదిత్య అంటే అభికి చాలా ఇష్టం. అభినే ఆదిత్యకి తండ్రి ఇక నువ్వు తండ్రివి అనే విషయం మర్చిపో


మాళవిక అభిమన్యు దగ్గరకి వస్తుంది. ఖుషిని దూరం చేసినట్టు ఆదిత్యని కూడా దూరం చేయాలని చూస్తున్నారు. అందుకే ఆదిత్యని లీగల్ గా దత్తత తీసుకోవాలి. నీ ఆస్తికి వారసుడిని చేయాలి. ఈ లీగల్ డాక్యుమెంట్స్ మీద ఒక చిన్న సంతకం పెట్టమని అడుగుతుంది. నా హ్యపీనెస్ కోసం ఈ బాండ్ పేపర్స్ మీద సైన్ చేయమని అంటుంది. చేయకపోతే ఏంటి పెళ్లికి ముందే విడాకులు కోసం సంతకం పెట్టమని అన్నట్టు ఉందని అభి అంటాడు. వారసుడిగా ప్రకటించడం అంటే పేపర్స్ మీద సంతకం పెట్టడం కాదు దానికి చాలా లీగల్ ప్రాసెస్ ఉంది పెళ్లి అవనివ్వు అప్పుడు చేద్దామని చెప్పేసరికి నమ్మేసి వెళ్ళిపోతుంది. పార్టీలో అభి ఫ్రెండ్స్ కావాలని వేదని తాగమని బలవంతం చేస్తారు. వాళ్ళని వేద కొట్టబోతుంటే అభిమన్యు తన చేతిని పట్టుకుంటాడు. యష్ వచ్చి కోపంగా అభి చేతిని పట్టుకుంటాడు.