తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న కాపీస్ట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు...


* కాపియిస్ట్‌ పోస్టులు


 ఖాళీల సంఖ్య: 84


జిల్లాలవారీగా ఖాళీల వివరాలు..
ఆదిలాబాద్-03, భద్రాద్రి కొత్తగూడెం-04, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు-05, జనగామ-01, జయశంకర్ భూపాలపల్లి-02, జోగుళాంబ గద్వాల-01, కామారెడ్డి-01, ఖమ్మం-01,  కుమరంభీమ్ ఆసిఫాబాద్-02, మహబూబాబాద్-01, మేడ్చల్-మల్కాజ్‌గిరి-10, ములుగు-02, నాగర్‌కర్నూలు-04, నారాయణపేట-03, నిజామాబాద్-02, పెద్దపల్లి-03, రంగారెడ్డి-19, సంగారెడ్డి-01, సిద్ధిపేట-04, సూర్యాపేట-04, వికారాబాద్-04, వనపర్తి-02, వరంగల్-03, యాదాద్రి-భువనగిరి-02.    


అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ (హయ్యర్ గ్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. 


వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు స్కిల్‌టెస్ట్ (టైపింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. 10 నిమిషాల ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. అలాగే కంప్యూటర్ మీద 45 నిమిషాల ట్రాన్‌స్క్రిప్షన్ ఉంటుంది. కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా, బీసీ అభ్యర్థులకు 35 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. హైకోర్టులో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వెయిటేజీ వర్తిస్తుంది. 


జీతభత్యాలు: నెలకు రూ.22,900-రూ.69,150 చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 12.05.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.06.2023.


➥ పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: ప్రకటించాల్సి ఉంది.


➥ స్కిల్‌ టెస్ట్‌ తేది: 2023, జులై.


Notification


Website



Also Read:


TS High Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..