మే 17 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మేషరాశివారికి ఆర్థిక పరిస్థితి మొదట్లో బలహీనంగా ఉన్నా, కానీ తరువాత ధనాభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీరు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేస్తున్న వారికి ఈరోజు ప్రమోషన్ లభించే అవకాశం మెండుగా ఉంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారం బాగాస సాగుతుంది.


వృషభ రాశి 


ఈ రోజు ఫలితాలు  మిశ్రమంగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు సకాలంలో  పనిని పూర్తి చేయకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రోజు, మీ సోదరులు మరియు సోదరీమణులను కలుసుకునే అవకాశం ముంది. మీ సొంత అవగాహనతో మీ కెరీర్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబం లో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయిఇందుకోసం స్నేహితుల్ని సంప్రదిస్తారు. కుటుంబ పెద్దలతో చర్చలు జరుపుతారు. 


మిధున రాశి


ఈరోజు మీరు మీ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించాల్సి ఉంటుంది . మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. స్నేహితుల నుంచి ప్రయోజనం  పొందుతారు. కుటుంబంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.  ఆహ్లాద  వాతావరణం ఉంటుంది. ఈరోజు ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. ముఖ్యమైన విషయాలను నిరభ్యంతరంగా  చర్చలు జరపొచ్చు. పెద్దలతో కలసి దైవ దర్శనాలుంటాయి .


Also Read: పంచతంత్రంతో విజయ రహస్యం


కర్కాటక రాశి


ఈ రాశివారికి వ్యాపారం లో కొంత ప్రతికూలత ఉంటుంది.   మీ పిల్లలతో  విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ సలహాలను స్వీకరిస్తారు . ఆస్తి కొనుగోలు విషయంలో అప్రమత్తం గా ఉండండి . ఆచి తూచి  నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం వద్దు.


సింహ రాశి 


సన్నిహితులతో ఉన్న విభేదాలను,  చర్చల ద్వారా పరిష్కరించటానికి  అనుకూలమైన సమయం ఇది.  మీ జీవిత భాగస్వామి మద్దతు పూర్తిగా లభిస్తుంది.  జీవిత భాగ స్వామి సాంగత్యం  లో స్వాంతన పొందుతారు. ఇంతకు ముందు  జరిగిన తప్పులు బయట పడి ఇంట్లో వాళ్ళు మీ పై  కోపంగా ఉంటారు . కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి.


కన్యా  రాశి 


మీరు ఒకేసారి అనేక పనులు చేపట్టడం వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. మీరు కూడా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి, భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికను రూపొందిస్తారు . ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులకు ప్రమోషన్ లభిస్తుంది . 


Also Read : మహాభారత యుద్ధంలో మరణించని కౌరవ‌వీరుడు ఒక్కడే..!


తులా రాశి


ఈ రాశివారు నూతన ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి  తీర్థయాత్రకు వెళ్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు జాగ్రత్త . ఈ రోజు అమ్మతో  మనసులోని మాటను చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.


వృశ్చిక రాశి 


ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉండదు . మీ తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నెరవేర్చండి. ఎప్పుడో పోయిన  వస్తువులు దొరికే అవకాశం ఉంది.   పిల్లల  ద్వారా  కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


ధనుస్సు రాశి 


ఈ రోజు మీరు అప్రమత్తంగా ఉండాలి , వ్యయ ప్రయాసలకు దూరంగా ఉండండి  . మీ ప్రత్యర్థుల్లో కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.. నివారించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. విద్యార్థుల ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుంది. ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే అప్పు తీసుకోకుండా ఉండండి.


మకర రాశి


ఈరోజు అనుకూలమైన రోజు . ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు . ఇంట్లోనే స్వయంగా పూజ కార్య క్రమాలు నిర్వహిస్తారు.  బంధువులు , అతిధుల రాక . ఉద్యోగం చేసే చోటు ఎవరితోనూ మీ బాధనూ , కానీ మనసులోని మాటను కానీ పంచుకోకండి. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని పనులు పూర్తి చేసుకుంటారు  


కుంభ రాశి


సంఘం లో పేరు ప్రతిష్టలు వ్యాపిస్తాయి.  రహస్య ఒప్పందాలకు దూరంగా ఉండండి.  సామాజిక కార్యక్రమాల్లొ పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది .  వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయవద్దు. వివాహం కానీ వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. 


మీన రాశి


ఈ రాశివారిని అనుకోని  సమస్యలు చుట్టుముడతాయి అయినా ధైర్యాన్ని కోల్పోకండి  . చిన్న నాటి స్నేహితుల కలయిక.  మీకు  అత్యంత సంతోషాన్ని ఇచ్చే  మిత్రులు  మిమ్మల్ని కలుస్తారు..అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి.  మానసిక ఒత్తిడి , అశాంతి ఉంటాయి.