Samsung Galaxy S24 Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సంస్థ తెలిపింది. కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.60 వేల కంటే తక్కువకే ఈ ఫోన్ అందుబాటులో ఉండటం విశేషం. కానీ అమెజాన్‌లో దాని కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ దక్కించుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర (Samsung Galaxy S24 Price)
ఈ ఫోన్ ధర ప్రస్తుతం మనదేశంలో రూ.59,999గా ఉంది. రూ.12,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రూ.3,000 అప్‌గ్రేడ్ బోనస్‌లు కూడా కలిపితే ఇంత తక్కువకు రానుంది. అయితే ఏదైనా మరో స్మార్ట్ ఫోన్‌ను ట్రేడ్ ఇన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.40 వేల వరకు అదనపు తగ్గింపు లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మనదేశంలో రూ.74,999 ధరలో లాంచ్ అయింది.
అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇదే అత్యంత తక్కువ ధర కాదండోయ్... అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.57,490కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా రూ.24,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ద్వారా ఈ ఫోన్ రేటు మరింత తగ్గనుంది.
అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి సేల్ వరకు ఆగితే మరింత తక్కువ ధరకు ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది. గతంలో సేల్స్ జరిగినప్పుడు ఈ ఫోన్ ధర రూ.56 వేల లోపుకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా మరింత తక్కువకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్పెసిఫికేషన్లు (Samsung Galaxy S24 Specifications)
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1.1 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమక్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ మధ్యలో ఉండనుంది. శాంసంగ్ స్వయంగా తయారు చేసే ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
కనెక్టివిటీ విషయానికి వస్తే... 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 167 గ్రాములుగా ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?