శాంసంగ్ గెలాక్సీ ఎం33 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో 4జీ, 5జీ వేరియంట్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇందులో శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని లీకులు వస్తున్నాయి.


మైస్మార్ట్ ప్రైస్ కథనం ప్రకారం... ఈ ఫోన్ మనదేశంలో కొన్ని వారాల్లో లాంచ్ కానుంది. మొదట ఇందులో ఒక్క వెర్షన్ మాత్రమే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందులో 4జీ, 5జీ వేరియంట్లు ఉన్నప్పటికీ రెండూ వేర్వేరుగా లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ స్మార్ట్ ఫోన్ SM-M336BU మోడల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ ఫోన్ గతంలో బీఐఎస్ వెబ్‌సైట్, గీక్ బెంచ్ సైట్లలో కనిపించింది. దీనికి సంబంధించిన సపోర్ట్ పేజీ కూడా శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్లో కనిపించింది.


ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే... ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. శాంసంగ్ ఎక్సినోస్ 1200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది.


6 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కూడా అందించనున్నారు.


ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు శాంసంగ్ మరో బడ్జెట్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ03. ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. 


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!