Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. రెండు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వెగాన్ లెదర్ ఫినిష్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ధర (Samsung Galaxy F55 5G Price in India)
ఈ ఫోన్ మనదేశంలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియంట్ ధర రూ.29,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గానూ ఉంది. ఆప్రికాట్ క్రష్, రైజిన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ఎర్లీ బర్డ్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది.
Read Also: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్, పొరపాటున ‘డిలీట్ ఫర్ మీ’ కొట్టినా ఇబ్బందేమీ లేదు!
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy F55 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ, వైఫై, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 180 గ్రాములుగా ఉంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది