Galaxy AI Feature: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. వాస్తవానికి ఏఐ ద్వారా చాలా మంది వ్యక్తుల పనులు చాలా సులభంగా, మరింత ఖచ్చితత్వంతో జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఫీచర్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. శాంసంగ్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ఫీచర్లను పరిచయం చేయనుంది. దీనిని గెలాక్సీ ఏఐ ఫీచర్స్ పేరుతో విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్‌ల్లో గెలాక్సీ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు కంపెనీ తన ఇతర డివైస్‌ల్లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు మొదట వీటిలోనే..
2024 జనవరి 17వ తేదీన కాలిఫోర్నియాలోని ఎస్ఏపీ సెంటర్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ అయింది. దీనిలో కంపెనీ మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఉన్నాయి. శాంసంగ్ ఈ మూడు ఫోన్లలోనూ ఏఐ ఫీచర్లను అందించింది.
శాంసంగ్ వన్‌యూఐ 6.1 అప్‌డేట్ ద్వారా తన ఇతర స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల్లో కూడా ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ డివైస్‌ల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఈ డివైస్‌ల్లో ఏఐ ఫీచర్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
గెలాక్సీ ఏఐ ఫీచర్ల ద్వారా వినియోగదారులు లైవ్ ట్రాన్స్‌లేషన్, చాట్ అసిస్ట్ ఫీచర్‌లు, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్‌లను పొందవచ్చు. అయినప్పటికీ శాంసంగ్ ప్రస్తుతం గెలాక్సీ ఏఐలో కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక ఫీచర్లను చేర్చింది. అయితే గెలాక్సీ ఏఐ ఫీచర్లను క్రమంగా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా శాంసంగ్ రాబోయే కాలంలో దాని ఇతర గెలాక్సీ డివైస్‌ల్లో కూడా ఏఐ ఫీచర్లను చేర్చవచ్చు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?