సౌత్ కొరియన్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ సామ్ సంగ్  ఎప్పటికప్పుడు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తూ వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అటు రేట్లు సైతం  వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా తగ్గిస్తుంది. తాజాగా సామ్ సంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌ లోని మరో స్మార్ట్‌ ఫోన్ ధరను  భారీగా తగ్గించింది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ32  స్మార్ట్‌ ఫోన్ ధరను రూ.3,500 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. రూ.25,000 లోపు బడ్జెట్‌లో రిలీజైన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఇప్పుడు రూ.20,000 లోపే కొనే అవకాశాన్ని కలిగిస్తున్నది. బ్యాంక్ ఆఫర్స్‌తో మరింత డిస్కౌంట్ పొందే వెసులు బాటు ఉంది. గతంలో  సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,499 ఉండేది. ప్రస్తుతం రూ.3,500 తగ్గించడంతో ధర రూ.19,999కి తగ్గింది. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ లో బ్యాంక్ ఆఫర్స్‌తో ఇంకా తక్కువ ధరకే ఈ మొబైల్ ను పొందే అవకాశం ఉంది.

   


సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 ఫీచర్లు


ఈ స్మార్ట్ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే ఉంది. మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌ తో  రన్ అవుతుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.  15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో రన్ అవుతుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.


సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 స్పెసిఫికేషన్లు


సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ ఫోన్‌ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. వెనుక వైపు 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆసమ్ బ్లాక్, ఆసమ్ బ్లూ, ఆసమ్ వయొలెట్ రంగుల్లో లభ్యం అవుతుంది.   


తగ్గిన సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ల ధరలు


సామ్ సంగ్ ఇటీవల పలు స్మార్ట్‌ ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించింది. సామ్ సంగ్  గెలాక్సీ ఏ53 ధర రూ.3,000, సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ధర రూ.1,500, సామ్ సంగ్ గెలాక్సీ ఏ33 5జీ ధర రూ.3,000 తగ్గించినట్లు ప్రకటించింది. అటు సామ్ సంగ్ గెలాక్సీ ఏ23 ధర రూ.1,000, సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్‌ ఫోన్ ధర రూ.1,000, సాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ధర రూ.5,000 తగ్గించిదంఇ. అమెజాన్‌ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో  ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో సామ్ సంగ్ స్మార్ట్‌ ఫోన్లపై మరిన్ని ఆఫర్లు లభించే అవకాశం ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?