Free Disney Plus Hotstar Plan: మీరు రిలయన్స్ జియో సిమ్‌ని ఉపయోగిస్తున్నారా? ఉచిత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే చవకైన ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ను ఉచితంగా అందించే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ రిలయన్స్ జియో దగ్గర ఉంది. దీంతో పాటు రిలయన్స్ జియో అందించే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లపై కూడా ఒక లుక్కేద్దాం.
రిలయన్స్ జియో రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 479 Prepaid Plan)
రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 479 ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దీంతోపాటు 1000 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది. మొత్తంగా 6 జీబీ డేటాను పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా అందిస్తుంది.
రిలయన్స్ జియో రూ. 799 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 799 Prepaid Plan)
ఈ జాబితాలో జియో రూ. 799 కూడా ఉంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను పొందుతారు. వీటితో పాటు యూజర్లు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.
Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!
రిలయన్స్ జియో రూ. 859 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 859 Prepaid Plan)
జియో రూ. 859 ప్లాన్ ద్వారా కూడా 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజూ 2 జీబీ డేటాను 84 రోజుల వ్యాలిడిటీతో పొందుతారు. ఇది కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా ఎంజాయ్ చేయవచ్చు.
రిలయన్స్ జియో రూ. 889 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 889 Prepaid Plan)
ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్, ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను పొందుతారు. దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే 84 రోజుల పాటు జియో సావన్ ప్రో మెంబర్‌షిప్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా పొందుతారు.
రిలయన్స్ జియో రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 949 Prepaid Plan)
జియో రూ. 949 ప్లాన్ ద్వారా వినియోగదారులు డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్, ప్రతి రోజూ 2 జీబీ డేటా ప్రయోజనాలను 84 రోజుల వ్యాలిడిటీతో పొందుతారు. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా పొందుతారు. ఈ ప్రయోజనాలన్నీ కాకుండా ఈ ప్లాన్‌తో 3 నెలలు లేదా మొత్తం 90 రోజుల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. జియో ఈ ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది. అయితే ఇది పరిమిత ఆఫర్ మాత్రమే.
Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!