Cyber ​​Fraud: దేశంలో సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కొత్త మార్గాల్లో దుండగులు ప్రజలను మభ్యపెడుతున్నారు. తమిళనాడు నుంచి అలాంటి షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ హ్యాకర్లు "పీఎం కిసాన్ యోజన" పేరుతో నకిలీ యాప్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ యాప్‌ని తన స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటారో వారి ఫోన్ హ్యాక్ అవుతుంది.


ఎలా మోసం చేస్తారు?
ఈ నకిలీ యాప్ ద్వారా మీ ఫోన్‌లోని అన్ని ముఖ్యమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలిస్తారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత హ్యాకర్లు మీ ఫోన్ ఓటీపీలు, ఇతర బ్యాంకింగ్ మెసేజ్‌లను యాక్సెస్ చేస్తారు. ఇది కాకుండా మీ ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని దుండగులు దొంగిలించారు. ఈ మొత్తం సమాచారాన్ని పొందిన తర్వాత హ్యాకర్లు యూపీఐ ద్వారా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తారు.



Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!


దుర్వినియోగం అవుతున్న ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ పథకాల పేరుతో మోసగాళ్లు ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఆర్థికంగా మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా వ్యక్తుల నుంచి ఆధార్, పాన్, ఇతర సమాచారాన్ని అడుగుతారు. దీని తర్వాత యూపీఐ ఖాతాలు హ్యాక్ చేసి బ్యాంకు నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తారు. ఈ తరహా మోసానికి చాలా మంది బాధితులుగా మారినట్లు సమాచారం.


తప్పించుకోవడం ఎలా?
అటువంటి మోసాల బారిన పడకుండా ఎలా ఉండవచ్చో తెలుసుకుందాం.
1. తెలియని యాప్‌ల నుంచి దూరంగా ఉండండి: వాట్సాప్ ద్వారా లేదా మరే ఇతర తెలియని లింక్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు.
2. అధికారిక సోర్స్‌ను మాత్రమే ఉపయోగించండి: యాప్‌లు లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా ప్లే స్టోర్‌ను మాత్రమే ఉపయోగించండి.
3. వెంటనే ఫిర్యాదు చేయాలి: మీరు సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.


ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ బ్యాంకింగ్ వివరాలు, ఫోన్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభుత్వ పథకాల పేరుతో ఎలాంటి అనుమానాస్పద యాప్ లేదా వెబ్‌సైట్‌లను నమ్మవద్దు.


ప్రస్తుతం మనదేశంలో సైబర్ నేరాలు బాగా ఎక్కువ అయ్యాయి. నేరం జరిగాక పరిగెత్తడం కంటే అలాంటివి జరగకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది.


Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!