Drugs seized in Yadadri Bhuvanagiri District | యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. తెలంగాణలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తు్న్న గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భవనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 


తెలంగాణ నార్కొటిక్ బ్యూరో, రాచకొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి దాదాపు 120 కిలోల నిషేధిత ఎపిడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ దాదాపు రూ. 24 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. యాదగిరిగుట్టలో తయారుచేసి హైదరాబాద్ తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్ గేట్ వద్ద డ్రగ్స్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో నేతి  కృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఫైజాన్ అహ్మద్‌తో పాటు డ్రైవర్ సునీల్‌ను అరెస్ట్ చేసినట్లు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. 


నిందితుల వద్ద నుంచి రెండు హ్యుందాయ్, వెర్ణ కార్లతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే భాను ప్రసాద్, వాసుదేవచారి, త్యనారాయణ అనే కెమిస్ట్ తో పాటు ముంబైకి చెందిన సల్మాన్ షేక్ డోల ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు వివరించారు. 



Also Read: KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?


భువనగిరి డీసీసీ ఆధ్వర్యంలో తనిఖీలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం రామోజీ పేట్ శివారులో ఉన్న కెమికల్ కంపెనీని గతంలోనే మూసివేశారు. యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమను అడ్డాగా మార్చుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. గత కొన్ని రోజులనుంచి నిఘా ఉంచిన పోలీసులు భువనగిరి డీసీపీ ఆధ్వర్యంలో  సోమవారం రాత్రి యాదాద్రి ఫార్మాస్యూటికల్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. మంగళవారం సైతం తనిఖీలు కొనసాగగా హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన 120 కేజీల మత్తు పదార్ధాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.