రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 75 అంగుళాల టీవీ చైనాలో లాంచ్ అయింది. ఇందులో గతంలో 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లు మాత్రమే ఇందులో లాంచ్ కాగా.. ఇప్పుడు 75 అంగుళాల వేరియంట్ కూడా లాంచ్ చేశారు. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్ అట్మాస్, హెచ్‌డీఎంఐ 2.1 ఇంటర్‌ఫేస్, 4కే రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 75 అంగుళాల వేరియంట్ ధర
దీని ధర చైనాలో 4,999 యువాన్లుగా(సుమారు రూ.59,300) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 11వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. మనదేశంలో ఈ టీవీ ఎప్పటినుంచి అందుబాటులోకి రానుందో తెలియరాలేదు.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 75 అంగుళాల వేరియంట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 75 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉంది. కలర్ గాముట్ వాల్యూ 94 శాతంగా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతంగా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. ఎంఈఎంసీ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.
ఇందులో నాలుగు ఇన్ బిల్ట్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. దీని సౌండ్ అవుట్ పుట్ 25Wగా ఉండనుంది. మీడియాటెక్ ఎంటీకే 9650 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.
ఇందులో ఒక హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు, రెండు హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, ఒక ఏవీ పోర్టు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎస్/పీడీఐఎఫ్ పోర్టు, ఆర్జే-45 పోర్టు, ఏటీవీ/డీటీఎంబీ, నాలుగు మైక్రోఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బరువు 28.2 కేజీలుగా ఉంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!