రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్లు అక్టోబర్ 28వ తేదీన లాంచ్ కానున్నాయి. ఇప్పుడు లాంచ్‌కు ముంగిట ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రోలతో పాటు రెడ్‌మీ నోట్ 11 కూడా లాంచ్ కానుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. మ్యాట్ ఫినిష్ కూడా వెనకవైపు ఉండనుంది. దీని టీజర్ల ప్రకారం.. ఇందులో మిస్టీ ఫారెస్ట్ అనే కొత్త కలర్ వేరియంట్ కూడా ఉండనుంది. జేబీఎల్ ఆడియో కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ దీనికి సంబంధించిన పలు టీజర్లను కూడా ఇప్పటికే విడుదల చేసింది. ఈ టీజర్లలో రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్‌ను వెనకనుంచి చూడవచ్చు. ఈ టీజర్‌లోనే ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. ఇందులో ఐఆర్ బ్లాస్టర్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను కూడా చూడవచ్చు.
ఫోన్ కిందవైపు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ ఉండనున్నాయి. ఇందులో వాల్యూమ్ రాకర్, పవర్/లాక్ కీ కూడా ఉండనున్నాయి. పవర్/లాక్ కీకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారన్న మాట.
ఫోన్ వెనకవైపు యాంటీ గ్లేర్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా రెడ్‌మీ అందించింది. దీనికి మ్యాట్ ఫినిష్ కూడా ఉంది. దీని మందం 0.83 సెంటీమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ చైనాలో అక్టోబర్ 28వ తేదీన లాంచ్ కానుంది. రెడ్‌మీ నోట్ సిరీస్ మనదేశంలో కూడా బాగా పాపులర్ కాబట్టి త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
చైనాలో జేడీ.కాం వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఇప్పటికే కనిపించింది. దీనికి సంబంధించిన ప్రీ-సేల్ కూడా ఇప్పుడు చైనాలో జరుగుతోంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌తో పాటు రెడ్‌మీ వాచ్ 2 కూడా వచ్చేశారం లాంచ్ కానుంది. ఇందులో చదరపు ఆకారంలో ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇవి మనదేశంలో లాంచ్ అయితే ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ అందించే ఫోన్లు ఆ ధరలో ఎప్పుడూ బెస్ట్‌గానే ఉంటాయి.
Also Read: Oppo K9s: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర బడ్జెట్‌లోనే.. అదిరిపోయే లుక్!
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?