చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఏకంగా 100 ఇంచెస్ స్మార్ట్ టీవీని చైనాలో లాంచ్ చేసింది. రెడ్‌మీ బ్రాండింగ్‌లో ఈ టీవీ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 100 అంగుళాల 4కే స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా వీటిలో ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఇందులో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (వీఆర్ఆర్), ఆటో లో లేటెన్సీ మోడ్ (ఏఎల్ఎల్ఎం) ఫీచర్లు కూడా ఉన్నాయి. డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.


రెడ్‌మీ మ్యాక్స్ 100 ఇంచెస్ టీవీ
ఈ టీవీ ధరను 19,990 యువాన్లుగా (సుమారు రూ.2,39,500) నిర్ణయించారు. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి సేల్ కూడా ప్రారంభం కానుంది.రెడ్‌మీ మ్యాక్స్ 86 అంగుళాల టీవీ చైనాలో 7,999 యువాన్ల (సుమారు రూ.95,700) ధరతో గతేడాది లాంచ్ అయింది.


రెడ్‌మీ మ్యాక్స్ 100 ఇంచెస్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 100 ఇంచుల 4కే ఐపీఎస్ ప్యానెల్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... పీక్ బ్రైట్‌నెస్ 700 నిట్స్‌గా ఉంది. డాల్బీ విజన్, ఐమ్యాక్స్ ఎన్‌హేన్స్‌డ్, హెచ్‌డీఆర్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను ఇది అందించనుంది.


ఏఎండీ ఫ్రీసింక్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. ల్యాగ్, స్క్రీన్ టియరింగ్, ఫ్రీజింగ్ వంటివి జరగకుండా ఆటో లో లేటెన్సీ మోడ్ ఉపయోగపడనుంది. ప్రస్తుత తరం గేమింగ్ కన్సోల్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ టీవీని రూపొందించారు.


ఇందులో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. కార్టెక్స్-ఏ73 కోర్లు ఇందులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను వీటిలో అందించారు. డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌లను కూడా ఇందులో అందించారు. 30W స్పీకర్లను కంపెనీ ఇందులో అందించింది. వైఫై 6, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు కూడా ఉన్నాయి. ఎంఐయూఐ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని కంపెనీ తెలిపింది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?