ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కాగ్ ( CAG ) నిర్ధారించింది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి ( Pankaj Choudhary ) టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ( MP Ram Mohan ) ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఏపీ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కాగ్‌ నిర్ధారించిందని పంకజ్ చౌదరి తన సమాధానంలో తెలిపారు. ఎక్కడెక్కడ ఆర్థిక అవక తవకలకు పాల్పడిందో తెలిపారు. 


కర్నూలు జిల్లా జైలు నుంచి ఒకే ఖైదీ వారంలో రెండు సార్లు పరారీ, ట్విస్ట్ ఏంటంటే?


కేంద్ర మంత్రి ..ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ఇచ్చిన సమాచారం ప్రకారం. ఏపీ ప్రభుత్వం 'వైఎస్‌ఆర్‌ గృహవసతి' ( YSR Gruha Vasati ) ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించింది. రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు...  జాతీయ విపత్తు నిధి కింద రూ.570.91 కోట్లు ఏపీకి కేంద్రం ఇచ్చింది. అయితే ఈ నిధులన్నీ మళ్లించినట్లుగా తెలిపారు. రూ.1,100 కోట్ల విపత్తు నిధులను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించారు.  ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఆ నిధులను మళ్లించారని కేంద్రమంత్రి తన సమాధానంలో తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఆ నిధులు అందించలేదని తెలిపింది. 


టీడీపీ ట్విట్టర్లో విచిత్రమైన పోస్టులు - స్పందించిన నారా లోకేష్, అసలేం జరిగిందంటే !


అయితే ఈ విషయంలో విపత్తు సాయానికి ఖర్చు చూపి ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘనకు ఆంధ్రప్రదేశ్ పాల్పడిందని కాగ్ నిర్ధారించింది. ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమంత్రి ( Central Minister ) స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్రం సమాచారం పంపిందన్నారు. ఆ దిద్దుబాటు చర్యలు ఏమిటనేదానిపై స్పష్టత లేదు. 


నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, గ్రూప్ -1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్


కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇతర నిధులకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని విపక్ష తెలుగుదేశం పార్టీ ( TDP ) కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఈ మేరకు విపత్తు నిధులపై అడిగిన ప్రశ్నలకు కేంద్రం నిజమేనని సమాధానం ఇచ్చింది. అయితే వెంటనే రాష్ట్రం దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లుగా కూడా చెప్పడంతో వివాదం ముగిసిపోయినట్లుగా ఉందని భావిస్తున్నారు.