Cheapest 5G Phone in India: రెడ్‌మీ ఏ4 5జీ (Redmi A4 5G) స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ బుధవారం అనౌన్స్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో మనదేశంలో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. న్యూఢిల్లీలో జరుగుతున్న వార్షిక ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 (IMC 2024) కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ప్రదర్శించారు. దీని ధర రూ.10 వేలలోపు ఉండనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ కానుంది. ఈ ఫోన్ మనదేశంలో అతి త్వరలోనే లాంచ్ కానుంది.


రెడ్‌మీ ఏ4 5జీ ధర (Redmi A4 5G Price in India)
రెడ్‌మీ ఏ4 5జీ ధర మనదేశంలో రూ.10 వేలలోపు ఉండనుంది. రెడ్‌మీ అనేది షావోమీ సబ్సిడరీ కంపెనీ. ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కానీ సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం కంపెనీ తెలపలేదు. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కంపెనీ వార్షిక ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 ఈవెంట్లో ప్రదర్శించింది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే



రెడ్‌మీ ఏ4 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Redmi A4 5G Specifications, Features)
ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి స్థాయి ఫీచర్లను కంపెనీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. కానీ భారతీయ మార్కెట్లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. క్వాల్‌కాం 4ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీ ద్వారా ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను తయారు చేశారు. ఇది 2 గిగాహెర్ట్జ్ పీక్ క్లాక్ స్పీడ్‌ను డెలివర్ చేయనుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను సపోర్ట్ చేయనుంది. 1 జీబీపీఎస్ వరకు డౌన్‌లోడ్ స్పీడ్‌ను ఇది అందించనుంది. 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉండనుంది.


90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉండే ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ 12 బిట్ ఐఎస్‌పీ ద్వారా రెండు 13 మెగాపిక్సెల్ కెమెరాలు, సింగిల్ 25 మెగాపిక్సెల్ కెమెరాను ఇది సపోర్ట్ చేయనుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కూడా ఈ ప్రాసెసర్‌ సపోర్ట్ చేయనుంది. ఐఎంసీ 2024 ఈవెంట్‌లో కనిపించిన దాని ప్రకారం ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి.


డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, నావిక్ శాటిలైట్ సిస్టంను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై 5, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీలను ఇది సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ 3.2 జెన్ 1 ట్రాన్స్‌ఫర్ స్పీడ్ (5 జీబీపీఎస్)ను సపోర్ట్ చేసే యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ మనదేశంలో సరిగ్గా ఏ తేదీకి లాంచ్ కానుందో ఇంకా తెలియరాలేదు. త్వరలో ఇది ఎప్పుడు ప్రజల్లోకి అందుబాటులోకి రానుందో ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?