Redmi A3X Launch: రెడ్‌మీ ఏ3ఎక్స్ స్మార్ట్ ఫోన్ షావోమీ గ్లోబల్ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని అనుకోవచ్చు. ఈ లిస్టింగ్‌లో దీనికి సంబంధించిన డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఇది ఒక ఎంట్రీ లెవల్ ఫోన్. ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందులో 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్, యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌ను అందించారు. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


పాకిస్తాన్‌లో ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 18,999 పాకిస్తాన్ రూపాయలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.5,700) నిర్ణయించారు. మనదేశంలో కూడా దీని సేల్ త్వరలో ప్రారంభం కానుంది. రెడ్‌మీ ఏ3 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అరోరా గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, మిడ్‌నైట్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ ఏ3ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఈ లిస్టింగ్ ప్రకారం రెడ్‌మీ ఏ3ఎక్స్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నారు. ఈ ఫోన్ రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ లభించనున్నాయి. ఇందులో 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లే ఇందులో ఉంది.


Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో


ఆక్టాకోర్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ అందించారు. ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేయవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు క్యూవీజీఏ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


వైఫై, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా రెడ్‌మీ ఏ3ఎక్స్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, వర్చువల్ యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లుగా ఉంది. 






Also Read: గేమింగ్ హబ్‌గా మారుతున్న యూట్యూబ్ - ప్లేయబుల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ!