Realme P2 Pro 5G Launch Date: రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. గతంలో లాంచ్ అయిన రియల్‌మీ పీ1 ప్రో 5జీకి తర్వాతి వెర్షన్‌గా కర్వ్‌డ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ రానుంది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు త్వరలో రివీల్ చేయనున్నారు. రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఏప్రిల్‌లో లాంచ్ అయింది. రియల్‌మీ పీ2 ప్రో 5జీతో పాటు రియల్‌మీ పీ2 5జీ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు. ఈ విషయమై కంపెనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
రియల్‌మీ పీ2 ప్రో 5జీ లాంచ్ డిటైల్స్
రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 13వ తేదీన మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ మైక్రో సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
దీనికి సంబంధించిన ప్రమోషనల్ ఇమేజ్‌ను కూడా కంపెనీ ఇప్పటికే రివీల్ చేసింది. గోల్డెన్ ఫ్రేమ్ ఉన్న గ్రీన్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వెనకవైపు మధ్యలో చదరపు ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను అందించారు. దాని చుట్టూ గోల్డెన్ కలర్ బోర్డర్ ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. దీని టీజర్ ప్రకారం ఫోన్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే, సన్నని అంచులు, సెల్ఫీ కెమెరా కోసం సెంటర్డ్ పంచ్ హోల్ కూడా అందించారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ఫోన్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని టీజర్‌లో తెలిపిన దాని ప్రకారం రియల్‌మీ పీ2 ప్రో 5జీ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ ఐదు నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే ఏకంగా గంటన్నర పాటు గేమింగ్ ఆడవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఏ ప్రాసెసర్, మిగతా ఫీచర్లు ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది.
రియల్‌మీ పీ1 ప్రో 5జీ మనదేశంలో రూ.19,999 ధరతో లాంచ్ అయింది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. ప్యారట్ బ్లూ, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ, రియల్‌మీ బడ్స్ ఎన్1 కూడా మనదేశంలో సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ కానున్నాయి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే