రియల్‌మీ సీ35 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 7వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. సూపర్ పవర్ సేవింగ్ మోడ్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో 18W ఫాస్ట్ చార్జింగ్ ఉండనుందని కంపెనీ ప్రకటించింది.


మార్చి 7వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.7 శాతంగా ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉండనుంది.


రియల్‌మీ సీ35 ధర
ఈ ఫోన్ థాయ్‌ల్యాండ్‌లో 5,799 బాత్‌ల (సుమారు రూ.13,350) ధరతో లాంచ్ అయింది. మనదేశంలో రూ.12 వేలలోపు దీని ధర ఉండే అవకాశం ఉంది.


రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు
థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయిన రియల్‌మీ సీ35 తరహాలోనే దీని స్పెసిఫికేషన్లు ఉంటాయా లేదా అన్న సంగతి తెలియరాలేదు. ఇప్పటివరకు కంపెనీ టీజ్ చేసిన స్పెసిఫికేషన్లు అయితే దాదాపు ఒకేలా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. యూనిసోక్ టీ616 ప్రాసెసర్, 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో ఉండనున్నాయి.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు ఒక మాక్రో కెమెరా, ఒక బ్లాక్ అండ్ వైట్ పొర్‌ట్రెయిట్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇందులో 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉండనుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!