రియల్‌మీ సీ11 (2021) స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రెండో సారి పెరిగింది. ఈ సంవత్సరం జూన్‌లో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఆగస్టులో దీని ధరను మొదటిసారి పెంచారు. ఇప్పుడు రెండోసారి పెరిగింది. ఇందులో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,299 నుంచి రూ.7,499కు పెంచారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,799 నుంచి రూ.8,999కు పెరిగింది. అంటే దీనిపై రూ.200 ధరను పెంచారన్న మాట.


ఈ ఫోన్ పెరిగిన ధరతో రియల్‌మీ.కాం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతానికి పాత ధరనే చూపిస్తుంది. త్వరలో ధర పెరిగే అవకాశం ఉంది. కూల్ బ్లూ, కూల్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


ఈ ఫోన్ ధర మొదట 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో మాత్రమే లాంచ్ అయింది. అప్పుడు దీని ధరను రూ.6,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ వేరియంట్ అయితే రూ.8,799 ధరతోనే తర్వాత లాంచ్ అయింది.


రియల్‌మీ సీ11(2021) స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 89.5 శాతం కాగా, 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. యూనిసోక్ ఎస్సీ9863 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.


2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 


ఇక కెమెరాల విషయానికి వస్తే.. రియల్‌మీ సీ11(2021)లో వెనకవైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 48 గంటల స్టాండ్‌బై టైంను ఈ ఫోన్ అందించనుందని రియల్‌మీ తెలిపింది.


డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను రియల్‌మీ అందించలేదు. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి