పార్లమెంట్ శీతకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని దేశమంతటా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (సవరణ) 2020 చేయాలని ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యాలయాల్లో నమోదయ్యే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వీలుగా విద్యార్థి తల్లి లేదా సంరక్షకుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ఈ బిల్లు ఉద్దేశమని వెల్లడించారు.


Also Read: 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ - సమాచారం లేదన్న ఉద్యోగ సంఘాలు !


నిరుద్యోగ భృతి నిరుద్యోగుల హక్కు 


దేశంలోని 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ (సవరణ) బిల్లును ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అలాగే ప్రార్థనా మందిరాలపై దాడులకు పాల్పడే నిందితులకు కఠిన జైలు శిక్ష విధించాలని మరొక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. ప్రార్ధనా మందిరాలు, స్థలాలపై దాడులు చేసి వాటిని అపవిత్రం చేసే నిందితులకు విధించే జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు పెంచేలా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (సవరణ) 2021 బిల్లును ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు టెంపుల్‌ డిస్ట్రక్షన్‌ పార్టీ (టీడీపీ) అరాచకాలకు తెరదించి సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చని విజయసాయి రెడ్డి అన్నారు. 


Also Read: మరో మహాభారతం... పల్నాటి యుద్ధం ! వీరారాధన ఉత్సవాలు ప్రారంభం !


టీడీపీ వర్సెస్ వైసీపీ


లోక్‌సభలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి వీడియోను మార్ఫింగ్ చేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రమే ఎఫ్ఆర్బీఎం పరిమితులు పెంచిందని లోక్ సభలో తాను మాట్లాడితే.. దానిని కూడా టీడీపీ ఎంపీలు వక్రీకరించారన్నారు. ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ లో  తాను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి.. ఇప్పుడు మాట్లాడినట్టు సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ లో భాగంగా మొట్టమొదటి సారి లోక్ సభలో తాను మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు కేవలం రూ. 100 కోట్లు నిల్వలు మిగిల్చి రూ. 4 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని చెబితే, దానిని మార్ఫింగ్ చేసి, ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం.. దానిపై టీడీపీ ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం శోచనీయమన్నారు.  వీడియోను మీడియా ఎదుట మార్గని భరత్ ప్రదర్శించారు. 


Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి