రియల్‌మీ గురువారం జరిగిన లాంచ్ ఈవెంట్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు టీవీ స్టిక్, వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను కూడా లాంచ్ చేసింది.  అవే రియల్ మీ బడ్స్ ఎయిర్ 3, రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్. వీటిలో రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3ని 10 నిమిషాలు చార్జ్ చేస్తే అవి 100 నిమిషాల బ్యాకప్‌ను అందిస్తాయని కంపెనీ అంటోంది.


రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3 ధర
వీటి ధరను రూ.3,999గా నిర్ణయించారు. గెలాక్సీ వైట్, స్టారీ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటికి సంబంధించిన సేల్ ఇప్పటికే రియల్‌మీ.కాం, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో ప్రారంభం అయింది. ప్రారంభ సేల్‌లో భాగంగా దీన్ని రూ.3,499కే విక్రయించనున్నారు.


రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్ ధర
రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్ ధరను రూ.2,999గా నిర్ణయించారు. ఏప్రిల్ 13వ తేదీన వీటి సేల్ ప్రారంభం కానుంది. రియల్‌మీ.కాం, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3 స్పెసిఫికేషన్లు
వీటిలో 10ఎంఎం బేస్ బూస్ట్ డ్రైవర్లను అందించారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కూడా ఇవి అందించనున్నాయి. టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను ఇవి పొందాయి. ఎక్స్‌టర్నల్ నాయిస్‌ను ఇది 42 డెసిబెల్స్ వరకు తగ్గించగలదు. ఇందులో రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఇందులో ఉంది. ఇవి 88ఎంఎస్ లో లేటెన్సీని అందించనుంది. గేమ్ మోడ్ కూడా ఇందులో ఉండనుంది.


బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీని ఇందులో అందించారు. దీన్ని రెండు డివైస్‌లకు ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫాస్ట్ పెయిర్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్‌ను ఇందులో అందించారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 30 గంటల బ్యాకప్‌ను ఇది అందించనుంది. చార్జింగ్ కేస్‌తో కలిపి దీని బరువు 37 గ్రాములు కాగా... ఒక్కో బడ్ బరువు 4.2 గ్రాములుగా ఉంది.


రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 టీవీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్ పనిచేయనుంది. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. పేరు తెలియని క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. కార్టెక్స్ ఏ35 కోర్లు ఇందులో ఉన్నాయి. 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. బ్లూటూత్ ఎనేబుల్డ్ వాయిస్ కంట్రోల్ రిమోట్ కూడా దీంతోపాటు అందించనున్నారు.


హెచ్‌డీఎంఐ 1.4, మైక్రో యూఎస్‌బీ పోర్టులు ఇందులో ఉన్నాయి. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, బ్లూటూత్ వీ5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ అసిస్టెంట్, ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ కూడా వీటితో పాటు అందించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ తెలిపింది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?