బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు మారుపేరైన రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరు రియల్‌మీ 8ఎస్. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్‌తో పనిచేయనుంది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఇందులో 90Hz స్క్రీన్ రిజల్యూషన్ అందించారు. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 33 వాట్స్ డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు అందించారు. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ, ఐకూ జెడ్ 3, ఒప్పో ఏ 74 5జీ ఫోన్లతో పోటీ పడనుంది. 


రియల్‌మీ 8ఎస్ ధర.. 
రియల్‌మీ 8ఎస్ స్మార్ట్ ఫోన్లో రెండు వేరియంట్లు అందించారు. 6 GB ర్యామ్+ 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా.. 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఇది యూనివర్సల్ బ్లూ, యూనివర్సల్ బ్లాక్ షేడ్స్‌లో లభిస్తుంది. దీని సేల్ ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ డాట్ కామ్, ప్రముఖ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ఉన్నవారు దీనిని రూ.12,599కే కొనుగోలు చేయవచ్చు. HDFC కార్డులు, ICICI క్రెడిట్ కార్డుల మీద రూ.1500 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 


రియల్‌మీ 8ఎస్ స్పెసిఫికేషన్లు.. 
డ్యూయల్ సిమ్ (నానో) రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0తో పనిచేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అందించారు. స్కీన్ రిజల్యూషన్ 1,080x2,400 పిక్సెల్స్‌గా ఉంది. 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో పాటు 90.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో అందించారు. 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 


64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోట్రైట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 


రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందించారు. 33 వాట్స్ డార్ట్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ (11V/ 3A చార్జర్ అందించారు) సపోర్టుతో రానుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్ /ఏ జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. దీని బరువు 191 గ్రాములుగా ఉంది. 


Also Read: Realme 8i: రియల్‌మీ 8ఐ వచ్చేసింది... రూ.13 వేల రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లు..


Also Read: Redmi 10 Prime Sale: రూ.12 వేల ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ సేల్ స్టార్ట్ అయింది..