రియల్‌మీ 8 సిరీస్‌లో మరో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. దీని పేరు రియల్‌మీ 8ఐ. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లేతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. రియల్‌మీ 8ఐ స్మార్ట్ ఫోన్లో 120Hz ఆల్ట్రా స్మూత్ స్క్రీన్ డిస్‌ప్లే ప్రత్యేకంగా అందించారు. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో ఆరు రకాల రీఫ్రెష్ రేటు అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ రెడ్ మీ 10 ప్రైమ్, శాంసంగ్ గెలాక్సీ ఎం 21 2021 ఎడిషన్, పోకో ఎం3 ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 


రియల్‌మీ 8ఐ ధర..
రియల్‌మీ 8ఐ స్మార్ట్ ఫోన్లో రెండు వేరియంట్లు అందించారు. 4GB ర్యామ్+ 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా.. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఇది స్పేస్ బ్లాక్, స్పేస్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని సేల్ ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. వీటిని ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ డాట్ కామ్, ఇతర రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. 


రియల్‌మీ 8ఐ స్పెసిఫికేషన్లు.. 


డ్యూయల్ సిమ్ (నానో) రియల్‌మీ 8ఐ స్మార్ట్ ఫోన్.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0తో పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అందించారు. స్కీన్ రిజల్యూషన్ 1,080x2,412 పిక్సెల్స్‌గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90.80 శాతంగా ఉంటుంది. 100 శాతం డీసీఐ పీ3 కలర్ గామ్యుట్, డ్రాగోన్ టైల్ ప్రో ప్రొటెక్షన్ ఉంటుంది.



  • ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. 

  • డైనమిక్ రీఫ్రెష్ రేటు 30Hz, 48Hz, 50Hz, 60Hz, 90Hz, 120Hz అనే ఆరు విభిన్న స్థాయిల్లో ఉండనుంది. 180Hz టచ్ శాంప్లింగ్ రేటు అందించారు. సినిమాలు, టీవీ ప్లే, గేమ్స్, ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ వంటి వాటికి తగినట్లు రీఫ్రెష్ రేటు అడ్జెట్ అవుతుంది.

  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 

  • 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వైడర్ సెల్ఫీలు తీసుకోవడం కోసం ఇందులో పానోసెల్ఫీ అనే ఫీచర్ అందించారు. 

  • దీని బరువు 194 గ్రాములుగా ఉంది. 


Also Read: iPhone 13 Launch: 14న ఐఫోన్ 13 సిరీస్‌ లాంచ్.. 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' పేరుతో యాపిల్ ఈవెంట్..


Also Read: Redmi 10 Prime Sale: రూ.12 వేల ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ సేల్ స్టార్ట్ అయింది..