Rapido: ర్యాపిడో యాప్‌లోని సమస్యను పరిష్కరించింది. ఇటీవల రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ర్యాపిడో వినియోగదారులు, డ్రైవర్ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. యాప్‌లోని ఈ సమస్య కారణంగా యూజర్లు, డ్రైవర్ల పూర్తి పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ లీక్ అయ్యాయి. ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ఈ సమస్య గురించి నివేదించారు. అయితే కంపెనీ ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించింది.
వాస్తవానికి ర్యాపిడోలో తలెత్తిన సమస్యను సెక్యూరిటీ రీసెర్చర్ పి.రంగనాథన్ కనుగొన్నారు. తన పరిశోధనలో సెక్యూరిటీ రీసెర్చర్ వెబ్‌సైట్ ఫారమ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని కనుగొన్నారు. దీనిలో ర్యాపిడో ఆటో రిక్షా వినియోగదారులు, డ్రైవర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. వినియోగదారుల పూర్తి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన సమాచారం ఆ ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌లో ఫిల్ అవుతోంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
ఫీడ్‌బ్యాక్ ఫారమ్ పబ్లిక్‌గా...
ర్యాపిడో ఏపీఐలో సమస్య కారణంగా ఈ ఫీడ్‌బ్యాక్ ఫారమ్ పబ్లిక్‌గా మారిందని టెక్ వెబ్‌సైట్ టెక్ క్రంచ్‌కి సెక్యూరిటీ రీసెర్చర్ తెలిపారు. ర్యాపిడో అభిప్రాయం కోసం థర్డ్ పార్టీ సర్వీసును ఉపయోగించింది. ఈ లీక్‌లో వినియోగదారులు, డ్రైవర్ల సమాచారాన్ని కలిగి ఉన్న 1800 ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌లు పబ్లిక్‌గా మారాయి. దీని కారణంగా చాలా మంది వ్యక్తుల మొబైల్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ఈ డేటా లీక్ వల్ల పెద్ద స్కామ్ జరిగే అవకాశం ఉందని సెక్యూరిటీ రీసెర్చర్ తెలిపారు. డ్రైవర్లు, వినియోగదారుల సమాచారం పబ్లిక్‌గా ఉండటం వల్ల, హ్యాకర్లు వ్యక్తులను డిజిటల్‌గా అరెస్టు చేయవచ్చు. అయితే ర్యాపిడో ఇప్పుడు వినియోగదారులు, సర్వీస్ ప్రొవైడర్ల ప్రధాన సమాచారాన్ని దాచిపెట్టింది.
ఈ లీక్ తర్వాత ర్యాపిడో సీఈవో అరవింద్ షనక మాట్లాడుతూ ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ప్రకారం మేం వినియోగదారుల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటాం. ఈ ఫీడ్‌బ్యాక్‌ను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తుంది. థర్డ్ పార్టీ ఆపరేషన్ కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!