Poco X6 Neo 5G Launched: పోకో ఎక్స్6 నియో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై పోకో ఎక్స్6 నియో 5జీ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. పోకో ఎక్స్6 నియో 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


పోకో ఎక్స్6 నియో 5జీ ధర (Poco X6 Neo 5G Price in India)
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, మార్షియన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీనికి సంబంధించిన ఎర్లీ స్పెషల్ యాక్సెస్ సేల్ ఈరోజు (మార్చి 13వ తేదీ) సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభం కానుంది.


పోకో ఎక్స్6 నియో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco X6 Neo 5G Specifications)
పోకో ఎక్స్6 నియో 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఈ ఫోన్‌కు రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను పోకో అందించింది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 93.3 శాతంగా ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 1000 నిట్స్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ అందించనుంది.


6 ఎంఎం మీడియాటైక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై పోకో ఎక్స్6 నియో 5జీ రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. స్టోరేజ్ నుంచి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 24 జీబీ వరకు పెంచుకోవచ్చు. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి గ్రాఫైట్ షీట్లు కూడా ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... పోకో ఎక్స్6 నియో 5జీ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం పోకో ఎక్స్6 నియో 5జీ ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


5జీ, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు పోకో ఎక్స్6 నియో 5జీలో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ బ్యాక్డ్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సింగిల్ స్పీకర్ ఇందులో అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని బరువు 0.77 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?