పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 28వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌ను పోకో ఇండియా కన్ఫర్మ్ చేసింది. పోకో ఎక్స్-సిరీస్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. దీనికి సంబందించిన పోస్టర్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుందని తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
మార్చి 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో ఏఐ బేస్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. పోకో ఎక్స్4 ప్రో 5జీ గ్లోబల్ వేరియంట్‌కు, ఇండియన్ వేరియంట్‌కు స్పెసిఫికేషన్లలో తేడాలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది.
పోకో ఎక్స్4 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఒక్క కెమెరా విషయంలో తప్ప మిగతా అన్ని స్పెసిఫికేషన్లు పోకో ఎక్స్4 ప్రో 5జీ గ్లోబల్ వేరియంట్ తరహాలోనే ఉండనున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది.
8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. అయితే ర్యామ్‌ను డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా 11 జీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ అంటోంది. 256 జీబీ వరకు స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో కంపెనీ అందించింది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఇందులో ఉన్నాయి.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?