Truck in Tornado | సుడి గాలులు, ఈదురు గాలులు వీస్తున్నప్పుడు వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గాలుల వల్ల వాహనాలు పల్టీలు కొట్టే ప్రమాదం ఉంది. తాజాగా టెక్సాస్‌లో కూడా అదే జరిగింది. సుడిగాలిలో చిక్కుకున్న ఓ కారు గిరగిర గాల్లో చక్కర్లు కొట్టింది. అలాంటి ఘటన చోటుచేసుకున్నప్పుడు డ్రైవర్ తప్పకుండా షాక్‌కు గురవ్వడం లేదా గాయాల వల్ల కారు నడపలేని స్థితిలో ఉంటాడని మనం భావిస్తాం. కానీ, అక్కడ జరిగింది వేరు. 


Also Read: మీలో లేదా మీ పార్టనర్‌లో ఈ లక్షణాలున్నాయా? వీరు చాలా చాలా రొమాంటిక్!


టెక్సాస్‌లోని ఎల్గిన్‌‌కు చెందిన ఓ డ్రైవర్ చెవ్రోలెట్ సిల్వెరడో అనే రెడ్ కలర్ మినీ ట్రక్‌‌ను నడుపుతున్నాడు. అదే సమయంలో ఆ మార్గాన్ని భారీ టొర్నాడో (సుడిగాలి) చుట్టుముట్టింది. ఆ గాలి వేగానికి ట్రక్ కూడా పైకి లేచింది. ఆ తర్వాత బోల్తాపడి.. మళ్లీ యథాస్థితికి చేరింది. చూస్తే.. తప్పకుండా డ్రైవర్ గాయపడి ఉంటాడని భావిస్తాం. మంచి విషయం ఏమిటంటే.. ఆ ట్రక్కులో డ్రైవర్ తనకు ఏమీ కానట్లు చాలా కూల్‌గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనను స్ట్రామ్ చేజర్ బ్రెయిన్ ఎంఫింగర్ తన కెమేరాలో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతే, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. మంగళవారం ఉదయం పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 6 మిలియన్ మందికి పైగా వీక్షించారు. 


Also Read: ఇదో ‘కంపు’ పాము, ఇది చేసే పనేంటో తెలిస్తే నవ్వు ఆగదు