Romantic Partner | కొన్ని జంటలను చూస్తుంటే.. ‘‘అబ్బా, భలే రొమాంటిక్‌గా ఉన్నారే’’ అని అనిపిస్తుంది. అదే సమయంలో.. మీ మీద మీకే సందేహం కూడా వస్తుంది. మనం వారంత రొమాంటికా కాదా? అనే సందేహం కలుగుతుంది. దీని గురించి మీ పార్టనర్ అభిప్రాయం తెలుసుకోడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ, వారి నుంచి అంత పాజిటివ్‌గా ఆన్సర్ రాకపోవచ్చు. అయితే, మీలో ఆ రొమాంటిక్ పర్శన్ ఉన్నాడో లేదో తెలుసుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. మీ లక్షణాల ద్వారా మీరేంటో తెలుసుకోవచ్చు. అవేంటో చూసేయండి మరి.
కొందరిని మాటల ద్వారా.. మరికొందరిని చేతల ద్వారా రొమాంటిక్ అని కనిపెట్టేయొచ్చు. కానీ, చాలామంది తమలోని రొమాంటిక్ యాంగిల్‌ను కనిపించకుండా జాగ్రత్తపడ్డతారు. అవసరమైనప్పుడే బయటపడుతుంటారు. అందుకే, పార్టనర్స్ సైతం తమ భాగస్వామి ఎంత రొమాంటిక్ అనే విషయాన్ని అంచనా వేయలేరు. రొమాంటిక్ అంటే కేవలం కామవాంఛ కాదు. అది ప్రేమను వ్యక్తం చేయడం లేదా, పంచడం. అది ఐదు, పది నిమిషాల్లో ముగిసిపోయే అనుభవం కాదు. ఒకరిపై ఒకరికి విశ్వాసం, నమ్మకం, ఆప్యాయతను పెంచే లక్షణం. మీలో లేదా, మీ పార్టనర్‌లో ఈ లక్షణాలు ఉంటే మీరు చాలా లక్కీ.
❤ పట్టపగలే మీ డీమ్ పార్టనర్ గురించి కలలుగంటున్నారా? అయితే, మీరు చాలా రొమాంటిక్.
❤ మీ పార్టనర్‌తో కలిసి అడుగులేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పాలని అనుకుంటున్నారా? నో డౌట్, మీరు చాలా రొమాంటిక్.
❤ ఏ కారణం లేకుండా మీలో మీరే నవ్వేసుకుంటున్నారా? అది నవ్వు కాదు, ఒక రొమాంటిక్ ఫీలింగ్.
❤ ఆమె లేదా అతడి కోసం మీరు లేఖలు, కవితలు రాసేస్తున్నారా? Wow, how romantic you are!!
❤ మీకు నచ్చిన వ్యక్తి కళ్ల ముందు నిలుచోగానే మాట తడబడుతుందా? అది మౌనం కాదు, ఫీలింగ్.
❤ ఆమె/అతడి కోసం మీకు పాట పాడాలి అనిపిస్తుందా? అయితే, అది మీ మనసు నుంచి వచ్చే రొమాంటిక్ భావన.
❤ నచ్చిన వ్యక్తితో కలిసి లంచ్ లేదా డిన్నర్ తినాలనిపించడం కూడా చాలా రోమాంటిక్ ఆలోచన.
❤ మీకు నచ్చిన వ్యక్తితో గడిపిన రోజు చాలా అందంగా అనిపించడం, కళ్లలోనే కదులుతుండటం ఒక గొప్ప రొమాంటిక్ అనుభూతి.
❤ మీరు ఇష్టపడే వ్యక్తిలోని లోపాలను కూడా మీరు ఇష్టపడుతుంటే.. అది కచ్చితంగా రొమాంటిక్ ఫీలింగే.
❤ మీ పార్టనర్ కష్టాన్ని మీ కష్టంగా భావించడం, వారి కోసం త్యాగానికి కూడా సిద్ధం కావడం కూడా మంచి ఫీలింగ్. అది మీ బంధాన్ని బలపరుస్తుంది.
❤ రొమాంటిక్ ఆలోచనలకు మీ పార్టనర్ అందం, రూపంతో ఎలాంటి సంబంధం ఉండదు. అది స్వచ్ఛమైన ప్రేమను తెలియజేస్తుంది.
❤ మీ పార్టనర్ భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకోవడం, వారి ఇష్టాలను తెలుసుకుని సర్‌ప్రైజ్ చేయాలనే ఆలోచనలు రావడం కూడా రొమాంటిక్ లక్షణమే.
❤ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడటం, చూసే కొద్ది అలా చూస్తుండిపోవాలనే ఆలోచన రావడం కూడా రొమాంటిక్కే!
❤ మీ పార్టనర్ నవ్వుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు నవ్వేస్తున్నారా? అయితే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
❤ మీకు నచ్చిన వ్యక్తికి మీ మనసులో మాటలన్నీ చెప్పేసి, మనసు తేలిక చేసుకోవడం కూడా గొప్ప అనుభూతే.
❤ పని వేళల్లో భాగస్వామిని బాగా మిస్ కావచ్చు. కానీ, వీకెండ్ లేదా సెలవు రోజుల్లో ఎక్కువ సేపు పార్టనర్‌కు కేటాయించాలనే ఆలోచన కలగడం.
❤ ‘నువ్వు’, ‘నీది’ అని విడదీసి మాట్లాడకుండా ‘మనం’, ‘మన’ అని కలిపి మాట్లాడటం. బంధాన్ని బలోపేతం చేసి ‘రొమాంటిక్’ ఫీల్ కలిగిస్తుంది.
Also Read: ఇదో ‘కంపు’ పాము, ఇది చేసే పనేంటో తెలిస్తే నవ్వు ఆగదు
పెళ్లికి ముందు, ఆ తర్వాత: కానీ, ఈ ఫీలింగ్ పెళ్లికి ముందు ఆ తర్వాత వేర్వేరుగా ఉంటుందని చాలామంది అంటారు. అయితే, పెళ్లి తర్వాత కొన్ని భావాలను చాలామంది మనసులోనే పెట్టేసుకుంటారు. ప్రేమించే సమయంలో తమ లవర్.. జీవిత భాగస్వామి కావాలనే లక్ష్యంతో చాలామంది రొమాంటిక్ ఫీలింగ్స్‌ను బయటకు ప్రదర్శిస్తుంటారు. పెళ్లి తర్వాత ఆ ప్రదర్శన క్రమేనా తగ్గుతుంది. వాటిని బయట పెట్టకుండా మనసులోనే ఉంచేసుకుంటారు. లైంగిక ఆలోచనలు కలిగినప్పుడు మాత్రమే ‘రొమాన్స్’ అస్త్రాన్ని బయటకు తీస్తారు. కానీ, పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా రొమాంటిక్ ఫీలింగ్స్‌ను అలాగే కొనసాగిస్తే.. లైఫ్ మరింత బ్యూటీఫుల్‌గా ఉంటుంది. మీ పార్టనర్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. కాబట్టి, పైన చెప్పినవి కేవలం లక్షణాలుగానే కాదు, జీవితాన్ని అందంగా మార్చుకోడానికి అవసరమైన చిట్కాలుగా కూడా స్వీకరించవచ్చు.
Also Read: ఇండియాలో.. వేసవిలో కూడా మంచు కొరిసే ప్రాంతం ఇదే