దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోన్న కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. అయితే మాస్క్, భౌతిక దూరం పాటించడం మాత్రం కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సమాచారమిచ్చింది.
2 ఏళ్ల క్రితం
దేశంలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం విపత్తు నిర్వహణ చట్టం కింద ఈ నిబంధనలను 2020 మార్చి 24న ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత కరోనా వ్యాప్తి, కేసుల సంఖ్య ఆధారంగా వీటిలో మార్పులు చేసింది. అయితే తాజాగా కరోనా వ్యాప్తి బాగా తగ్గిన కారణంగా వీటిని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది.
ఆ రెండు మాత్రం
కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తిసినప్పటికీ ప్రజలంతా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంశాఖ సూచించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భల్లా కోరారు. ఒకవేళ కేసులు పెరిగితే స్థానిక ప్రభుత్వాలు.. తిరిగి నిబంధనలను విధించే అంశాన్ని పరిశీలించవచ్చని భల్లా తెలిపారు.
కేసుల సంఖ్య
దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 1,778 మందికి వైరస్ సోకింది. మరో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,542 మంది వైరస్‌ను జయించారు.
Also Read: Corona Lockdown in US: అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్- ఆ వేరియంట్‌తో ముప్పు తప్పదా?
Also Read: AAP Delhi : డ్రైనేజీ క్లీన్ చేశాడని పాలాభిషేకం - ఢిల్లీలో ఆప్ కౌన్సిలర్ తీరు వైరల్