ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) కౌన్సిలర్ ఒకరు తన ఏరియాలో మున్సిపల్ ఉద్యోగులు డ్రైనేజీని క్లీన్ చేయలేదంటూ స్వయంగా క్లీన్ చేశారు.  తెల్లని బట్టలు వేసుకుని అందులోకి దిగి క్లీన్ చేసి మురికిగా బయటకు వచ్చారు. ఆయన సేవను చూసి కాలనీ వాసులు పొంగిపోయారు. వెంటనే పెద్ద ఎత్తున పాల క్యాన్లు తీసుకు వచ్చి ఆయనను పాలతో ( Milk ) శుభ్రం చేశారు. మొత్తం ఓ డ్రమెటిక్ సీన్‌లా ఈ సన్నివేశం జరిగిపోయింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్‌కు షాక్ - ఏకకాలంలో ఇళ్లు, ఆఫీసులో ఐటీ శాఖ సోదాలు


ప్రస్తుతం ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల ( Delhi Munsipal Elections ) హడావుడి నడుస్తోంది. ప్రభుత్వం ఆప్‌దయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఈ కారణంగా పైచేయి కోసం రెండు పార్టీలు అదేపనిగా ప్రయత్నాలుచేస్తున్నాయి. దీంతో నాయకుల పోరాటం ఎక్కువైపోయింది. ఎవరికి వారు తామే నిజమైన సేవకులం అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ క్రమంలో ఆప్ కౌన్సిలర్ హసీబ్- ఉల్-హసన్  శాస్త్రి పార్క్‌లో ( Sastry Park ) పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి దూకాడు.


ఆ కోడలికి అత్తవారింట్లో నివసించే హక్కు ఉంది: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు


ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానంటూ  తర్వాత.. తన సహాయకుల సహాయంతో దానిని క్లీన్ చేయడానికి కావాల్సిన పరికరాలను అందుకొని.. దానిని శుభ్రం చేశాడు.   దానిని శుభ్రం చేసి బయటకు వచ్చిన తర్వాత  ఆయనకు ఆయన మద్దతుదారులు పాలతో అభిషేకం చేయడం గమనార్హం. సినిమాటిక్ రేంజ్ లో.. ఆయనకు వారు పాలాభిషేకం చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.



అయితే డ్రైనేజీ ఎప్పుడూ అలాగే ఉంటుందని... ఆయన డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందస్తు ప్లాన్‌తో డ్రామాలు ఆడారని ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ  బాగు చేయకపోతే...  చెప్పి బాగు చేయించుకోవాలని.. ఆయన కౌన్సిలర్ అని.. కేవలం ప్రచారం కోసమే డ్రైనేజీ శుభ్రం చేసి పాలాభిషేకం చేయించుకుంటున్నారన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇలాంటి సంఘ సేవ చేయడం తరచూ హైలెట్ అవుతూనే ఉంటుంది.