Poco M6 Plus 5G Launched: పోకో ఎం6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సెలరేటెడ్ ఎడిషన్) ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. డ్యూయల్ సైడెడ్ గ్లాస్ డిజైన్, ఐపీ53 రేటెడ్ బిల్డ్, డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ డ్యూయర్ కెమెరా యూనిట్‌ను కంపెనీ అందించింది. ఇందులో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా అందించారు. పోకో ఎం6 5జీ, పోకో ఎం6 ప్రో 5జీ మొబైల్స్ కూడా ఈ లైనప్‌లో ఉన్నాయి.


పోకో ఎం6 ప్లస్ 5జీ ధర (Poco M6 Plus 5G Price in India)
పోకో ఎం6 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,499గా ఉంది. ఇక టాప్ ఎండ్ మోడల్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


పోకో ఎం6 ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco M6 Plus 5G Specifications)
ఇందులో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సెలరేటెడ్ ఎడిషన్) ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా మరో 8 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధరిత హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎం6 ప్లస్ 5జీ పని చేయనుంది. రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5030 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ53 రేటింగ్ కూడా ఉంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.



Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే