IBPS Specialist Officers Recruitment Notification 2025-26: దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) నోటిఫికేషన్ (CRP SCL-XIV) విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 896 పోస్టులు
1) ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 170 పోస్టులు
అర్హత: బీటెక్/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్).
2) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 346 పోస్టులు
అర్హత: డిగ్రీ (అగ్రికల్చర్ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసికల్చర్/అగ్రి మార్కెటింగ్ & కోఆపరేషన్/ కో-ఆపరేషన్ &బ్యాంకింగ్/ ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్)
3) రాజ్‌భాష అధికారి (స్కేల్-1): 25 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ (హిందీ/ సంస్కృతం). డిగ్రీ స్థాయిలో హిందీ/ సంస్కృతం తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి.
4) లా ఆఫీసర్ (స్కేల్-1): 125 పోస్టులు
అర్హత: లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) ఉండాలి.
5) హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 25 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్/ హెచ్‌ఆర్‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా).
6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 205 పోస్టులు
అర్హత: డిగ్రీతోపాటు రెండేళ్ల ఎంఎంఎస్ (మార్కెటింగ్)/ ఎంబీఏ(మార్కెటింగ్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం.
వయోపరిమితి: 01.08.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1994 - 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్; ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.
➥ ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: అక్టోబరు, 2024
➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబరు, 2024.
➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: నవంబరు/డిసెంబరు 2024.
➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: డిసెంబరు, 2024.
➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబరు, 2024.
➥ మెయిన్ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి/ ఫిబ్రవరి, 2025.
➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2025.
➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2025.