Poco New Phone: పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ96 (Mediatek Helio G96) ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కూడా కంపెనీ అందించింది. దీని 5జీ వేరియంట్ పోకో ఎం4 ప్రో 5జీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది.


పోకో ఎం4 ప్రో 4జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ రూ.17,999గా ఉంది. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది.


మార్చి 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ కూడా అప్లై చేస్తే... ఇందులో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న 256 జీబీ స్టోరేజ్ ఫోన్లలో అత్యంత చవకైనది ఇదే.


పోకో ఎం4 ప్రో 4జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ర్యామ్‌ను కూడా డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా 11 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో మాక్రో కెమెరా కూడా ఉ:ది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


4జీ ఎల్టీఈ, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 61 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ అంటోంది. దీని బరువు 179.5 గ్రాములుగా ఉంది.


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!