Oppo and OnePlus AI Features: ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ల ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. శాంసంగ్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లోని మూడు ఫోన్‌లను ఏఐ ఫీచర్లతో లాంచ్ చేసింది. దీనికి కంపెనీ గెలాక్సీ ఏఐ అని పేరు పెట్టింది. శాంసంగ్ తర్వాత ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలు కూడా తమ స్మార్ట్‌ఫోన్‌లలో కొన్నింటిని ఏఐ ఫీచర్లతో తీసుకురానున్నాయి. ఈ రెండు కంపెనీల ఫోన్‌లలో వచ్చే ఏఐ ఫీచర్లు, ఆ ఫీచర్లు అందుకునే ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్‌లలో ఏఐ ఫీచర్లు
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబో ద్వారా ఒప్పో తన తాజా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన అప్‌డేట్‌లో ఏఐ ఫీచర్లను చేర్చినట్లు ప్రకటించింది. అంటే ఒప్పో అన్ని ఫోన్‌లలో ఈ ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయన్న మాట. ఒప్పో ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను కలర్ ఓఎస్ ద్వారా అందిస్తోంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా చైనాలో కలర్ ఓఎస్‌పై పని చేస్తాయి. అయితే చైనా వెలుపల గ్లోబల్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌లో సాఫ్ట్‌వేర్ కోసం ఆక్సిజన్ ఓఎస్ అందిస్తారు.


చైనాలో ఒప్పో, వన్‌ప్లస్‌కు సంబంధించిన  కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రావడానికి ఒక కారణం ఏంటంటే ఆండ్రాయిడ్ 14లో కూడా ఏఐ సపోర్ట్ ఉండటం. అందుకే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా అప్‌డేట్ ద్వారా ఈ రెండు ఫోన్‌లలో ఏఐ ఫీచర్లు అందించనున్నారు. ఏఐ డిలీషన్, ఏఐ కాల్ సమ్మరీ, షియాబోవు వాయిస్ అసిస్టెంట్, ఏఐ గ్రీటింగ్ కార్డ్, ఏఐ ఫోటో స్టూడియో వంటి అనేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ రెండు ఫోన్‌లలో 100 కంటే ఎక్కువ ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి.


ఏఐ ఫీచర్లు అందించబడే స్మార్ట్‌ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం


ఏఐ ఫీచర్లు అందుకోనున్న ఒప్పో స్మార్ట్‌ఫోన్లు
ఒప్పో ఫైండ్ ఎక్స్7 (OPPO Find X7)
ఒప్పో ఫైండ్ ఎక్స్7 అల్ట్రా (OPPO Find X7 Ultra)
ఒప్పో ఫైండ్ ఎక్స్6 (OPPO Find X6)
ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రో (OPPO Find X6 Pro)
ఒప్పో రెనో 11 (OPPO Reno 11)
ఒప్పో రెనో 11 ప్రో (OPPO Reno 11 Pro)
ఒప్పో రెనో 10 (OPPO Reno 10)
ఒప్పో రెనో 10 ప్రో (OPPO Reno 10 Pro)
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ (OPPO Reno10 Pro+)
ఒప్పో ఫైండ్ ఎన్3 (OPPO Find N3)
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (OPPO Find N3 Flip)


ఏఐ ఫీచర్లు అందుకోనున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు
వన్‌ప్లస్ 12 (OnePlus 12)
వన్‌ప్లస్ 11 (OnePlus 11)
వన్‌ప్లస్ ఏస్ 3 (OnePlus Ace 3)
వన్‌ప్లస్ ఏస్ 2 (OnePlus Ace 2)
వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో (OnePlus Ace 2 Pro) 


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?