ఒప్పో ఏ16కే స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో మనదేశంలో లాంచ్ అయిన ఒప్పో ఏ16కు వాటర్ డౌన్ వేరియంట్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఒప్పో ఏ16కే ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.10,490గా నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల్లో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఒప్పో ఏ16కే స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత కలర్ఓఎస్ 11.1 లైట్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందించారు. ఇందులో స్టైలిష్ ఫిల్టర్లు, బ్యాక్‌లైట్ హెచ్‌డీఆర్, డాజిల్ కలర్ మోడ్, నైట్ ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక ముందువైపు కెమెరా హెచ్‌డీఆర్, నేషనల్ స్కిన్ రీటచింగ్, ఏఐ ప్యాలెట్‌లను కూడా సపోర్ట్ చేయనుంది. దీని స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా జీబీ పెంచుకోవచ్చు. ఇందులో 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. సూపర్ నైట్ టైం స్టాండ్‌బై, ఆప్టిమైజ్డ్ నైట్ చార్జింగ్, సూపర్ పవర్ సేవింగ్ మోడ్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బిల్ట్ ఇన్ బ్యాటరీ ఒకరోజు పూర్తి బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!