వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీల్లోనూ 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ సపోర్ట్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పనిచేయనున్నాయి. వీటిలో 24W ఫుల్ రేంజ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఆటో లో  లేటెన్సీ మోడ్ కూడా ఇందులో అందించారు.


వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ ధర
వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ 32 అంగుళాల టీవీ ధర రూ.16,499గా నిర్ణయించారు. ఇందులో 43 అంగుళాల వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఇక వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ 32 అంగుళాల వేరియంట్ ధర రూ.16,999గానూ, 43 అంగుళాల వేరియంట్ ధరను రూ.27,999గానూ నిర్ణయించారు. వీటిలో వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు.ఇక వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ ఆఫ్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ రెండిటి సేల్ ఫిబ్రవరి 21వ తేదీ నుంచి జరగనుంది.


వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ఈ రెండిట్లోనూ 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉన్నాయి. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌లో హెచ్‌డీ రిజల్యూషన్, వై1ఎస్ ఎడ్జ్‌లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేలను అందించారు. ఈ రెండు టీవీల్లోనూ హెచ్‌డీఆర్10+, హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ సపోర్ట్ అందించారు. టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది.


వినియోగదారులకు మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి ఇందులో ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా అందించారు. దీంతోపాటు ఇందులో వన్‌ప్లస్ కనెక్ట్ 2.0ను కూడా అందించారు. దీని ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లను రిమోట్ కంట్రోల్ తరహాలో ఉపయోగించవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.


డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఈ టీవీల్లో ఉంది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ మోడల్స్‌లో 20W ఫుల్ రేంజ్ స్టీరియో స్పీకర్లు, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్‌లో 24W స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ రెండిట్లోనూ ఆక్సిజన్ ప్లే 2.0ను అందించారు. 230కి పైగా లైవ్ చానెల్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!