వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోలకు ఆక్సిజన్ఓఎస్ 12 అప్‌డేట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆపరేటింగ్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నందున వాటిని సరిచేసే వరకు అప్‌డేట్‌ను కంపెనీ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను కూడా వన్‌ప్లస్ విడుదల చేసిందని సమాచారం.
ఈ అప్‌డేట్‌లో ముందుగా తెలిపిన ఫీచర్లు అందించలేదని, వినియోగదారులు కంప్లైంట్ చేస్తున్నారు. దీంతోపాటు కొన్ని ఫీచర్లను తీసేశారని కూడా తెలుస్తోంది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో వినియోగదారులకు ఈ అప్‌డేట్‌ను గతవారం నుంచి అందిస్తున్నారు.
ఆండ్రాయిడ్ పోలీస్ కథనం ప్రకారం.. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోలకు ఆక్సిజన్ఓఎస్ 12 అప్‌డేట్‌ను కంపెనీ నిలిపివేసింది. ‘ఆక్సిజన్ ఓఎస్ 12 అప్‌డేట్ ద్వారా వినియోగదారులకు కొన్ని సమస్యలు తలెత్తిన సంగతి మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఉన్న అప్‌డేట్‌ను నిలిపివేసి.. కొత్త అప్‌డేట్‌ను అందిస్తాం.’ అని వన్‌ప్లస్ తన ప్రకటనలో పేర్కొంది.
త్వరలో అన్ని ప్రాబ్లమ్స్‌ను ఫిక్స్ చేసి వన్‌ప్లస్ ఈ అప్‌డేట్‌ను రీ-రిలీజ్ చేసే అవకాశం ఉంది. వన్‌ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఈ అప్‌డేట్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే వచ్చింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం మీద ఆధారపడి ఈ అప్‌డేట్ రూపొందించారు. ఇప్పటి వరకు గూగుల్, శాంసంగ్‌లు మాత్రమే ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్లను అందించాయి.
ఇందులో యాప్ హైబర్నేషన్, మైక్రోఫోన్, కెమెరా ఇండికేటర్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ అప్‌డేట్‌లో కొన్ని ఫీచర్లు అందుబాటులో లేవని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్‌కు ఈ అప్‌డేట్ వస్తే అస్సలు చేయకండి.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!