OnePlus Ace 3V Launched: వన్‌ప్లస్ ఏస్ 3వీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్‌గా ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్‌లో వన్‌ప్లస్ మార్క్ అలెర్ట్ స్లైడర్ చూడవచ్చు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. త్వరలో సేల్ కూడా స్టార్ట్ కానుంది. మనదేశంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4గా ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం.


వన్‌ప్లస్ ఏస్ 3వీ ధర (OnePlus Ace 3V Price)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో రూ.23,400) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగానూ (సుమారు రూ.26,900), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను  2,599 యువాన్లుగానూ (సుమారు రూ.30,400) నిర్ణయించారు.


మ్యాజిక్ పర్పుల్ సిల్వర్, టైటానియం ఎయిర్ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఒప్పో చైనా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రారంభం అయ్యాయి. మార్చి 25వ తేదీన దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.


వన్‌ప్లస్ ఏస్ 3వీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (OnePlus Ace 3V Specifications)
ఇందులో 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 2150 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ ఏస్ 3వీ రన్ కానుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... వన్‌ప్లస్ ఏస్ 3వీ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు.


వన్‌ప్లస్ ఏస్ 3వీలో 100W వైర్డ్ సూపర్‌వూక్ సపోర్ట్ ఉన్న 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 7, బ్లూటూత్ 5.4, బైదు, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది. వన్‌ప్లస్ త్వరలో మనదేశంలో మరిన్ని డివైస్‌లు లాంచ్ చేయడానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే వన్‌ప్లస్ మనదేశంలో మొబైల్స్, టీవీలు, ట్యాబ్లెట్లు, మొబైల్ యాక్సెసరీస్ విభాగంలో ఉత్పత్తులను విక్రయిస్తోంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?