OnePlus 12R: వన్‌ప్లస్ ఈ సంవత్సరం మొదటి నెలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్2లో కంపెనీ రెండు ఫోన్‌లను విడుదల చేసింది. మొదటి ఫోన్ వన్‌ప్లస్ 12 కాగా రెండో ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్. ఈ రెండు ఫోన్‌ల అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు కంపెనీ వన్‌ప్లస్ 12ఆర్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రీఫండ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ 12ఆర్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులకు కంపెనీ డబ్బును రీఫండ్ చేస్తుందని దీని అర్థం.


తప్పుడు ప్రచారం చేసిన వన్‌ప్లస్
వాస్తవానికి వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ మొదటి వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. రెండో వేరియంట్ 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ సిరీస్‌లో లాంచ్ చేసే సమయంలో 256 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్‌లో యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఫీచర్ ఉందని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్ 128 జీబీ వేరియంట్‌లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఫీచర్ ఉంది.


వన్‌ప్లస్ 12ఆర్ టాప్ వేరియంట్ కోసం కంపెనీ చేసిన ప్రకటన తప్పు అని ప్రూవ్ అయింది. ఈ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఫీచర్‌తో వస్తుంది. కంపెనీ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా ఇప్పుడు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు పూర్తి డబ్బును తిరిగి రీఫండ్ చేయాల్సి ఉంటుంది.


వన్‌ప్లస్ ప్రెసిడెంట్, సీవోవో కిండర్ లియు ఈ సమస్యపై చర్య తీసుకున్నారు. ‘మీ సహనానికి ధన్యవాదాలు. ఈ పరిస్థితి గురించి మా కస్టమర్ సేవకు తెలియశామని మీకు ప్రకటిస్తున్నాం. వారు గత కొన్ని వారాలుగా ఇబ్బందుల్లో ఉన్న వినియోగదారులకు సహాయం చేస్తారు.’ అని అయన ఫోరమ్ పోస్ట్‌లో రాశారు. 


మీరు వన్‌ప్లస్ 12ఆర్ 256 జీబీ వేరియంట్‌ని కొనుగోలు చేసి మీ ఫోన్ ఫైల్ సిస్టమ్ టైప్ స్టేటస్ గురించి చూడాలనుకుంటే కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. వారు తదుపరి దశల్లో మీకు సహాయం చేస్తారు. 2024 మార్చి 16వ తేదీ వరకు ఈ రీఫండ్ వస్తుంది.


ఇంతకుముందు సీనియర్ వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు ప్రమోషన్ కోసం కొనుగోలుదారులకు క్షమాపణలు చెప్పారు. ఇది కంపెనీ తరఫున లోపం అని పేర్కొన్నారు. ఇది కాకుండా కస్టమర్లు ఓపికగా ఉండి కంపెనీకి సపోర్ట్ ఇవ్వాలని కంపెనీ విజ్ఞప్తి చేసింది.


మరోవైపు ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. కొన్ని నెలల క్రితం ఈ ఫోన్ సౌదీ అరేబియా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఇవి ఏఐని సపోర్ట్ చేయడం విశేషం. ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?