Atluri Purnachandra Rao: అట్లూరి పూర్ణచంద్రరావు.. టాలీవుడ్ లో లెజెండరీ ప్రొడ్యూసర్. ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు ఆయన. ఎంతోమంది హీరోలను వెండితెరకు పరిచయం చేశారు. అలా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన ఆయన.. 2004 తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఇక కొన్నేళ్ల తర్వాత ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడానికి కారణాలు అన్నీ పంచుకున్నారు.
చిరంజీవితో మళ్లీ సినిమా తియ్యంది అందుకు..
సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయి తాను ప్రస్తుతం కూర్గ్ లో ఉంటున్నానని చెప్పారు అట్లూరి పూర్ణచంద్రరావు."సినిమా ఫీల్డ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని, కూర్గ్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాను. ఇక చాలు అనిపించే వెళ్లిపోయాను. ఇప్పుడు వస్తున్న సినిమాలు, టెక్నాలజీతో పోటీ పడలేనేమో అనుకున్నాను. అందుకే, ఈ డెసిషన్ తీసుకున్నాను" అని అన్నారు.
"చట్టానికి కళ్లులేవు అనే సూపర్ హిట్ సినిమా తర్వాత చిరంజీవితో ఎందుకు సినిమా చేయలేదు?" అనే ప్రశ్నకు ఆయన నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు. "దానికి ఆన్సర్ చెప్పడం ఇప్పుడు మంచిది కాదేమో అనిపిస్తుంది. దానికి నేను కారణమా? లేక ఆయన కారణమా? అనే విషయం ఇప్పటికీ అర్థంకాదు. దీనిపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని అన్నారు. 'అవునన్నా కాదన్నా కూడా' డిజపాయింట్ సినిమా. తేజ తెలివి, యాటిట్యూడ్ చేసి డైరెక్ట్ చేయమన్నాను. ''మీ లాంటి వాళ్లు ఎంకరేజ్ చేస్తే తీస్తాను'' అన్నాడు. అలా 'అవునన్నా కాదన్నా' సినిమా తీశాడు. తేజ కథ చెప్పిన దానికి తీసిన దానికి చాలా తేడా ఉంది. షూటింగ్ అంతా రాజమండ్రిలో చేశారు. సినిమా చూసి తృప్తిగా లేదు అన్నాను. ''మీరు ఈ మధ్య తెలుగు సినిమాలు చేయలేదు కదా'' అన్నాడు. సినిమా తీసుకునేందుకు బయర్స్ వచ్చారు. కొన్నారు.. కానీ, నష్టపోయారు. ఇక ఆ తర్వాత వాళ్లకు కాంపన్సేట్ చేసి.. ఇక వద్దు ఈ లైన్ అని వెళ్లిపోయాను" అని చెప్పారు అట్లూరి పూర్ణచంద్రరావు.
విజయవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశరావుని భాగస్వామిగా చేసుకుని ‘అగ్గిమీద గుగ్గిలం’ సినిమా తీశారు అట్లూరి. నవభారత్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టి నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత ‘ఉక్కుపిడుగు’, ‘రౌడీరాణి’, ‘పాపం పసినవాడు’, ‘యమగోల’ రవితేజతో ‘వెంకీ’, ఉదయ్ కిరణ్ తో ‘ ఔనన్నా కాదన్నా’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్‌పురిలో ఒక చిత్రం నిర్మించారు. లెజెండ్ ప్రొడ్యూసర్, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కూర్గ్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు.
Also Read: ఒకప్పటి హీరోయిన్ - ఇప్పుడు కార్తీ చెల్లిగా