Actress Sri Divya - Karthi: సినిమా ఇండ‌స్ట్రీలో కెరీర్ ఎప్పుడు ఎలా మ‌లుపు తిరుగుతుందో అర్థంకాదు. ఒక్కోసారి హీరోయిన్ గా చేసిన వాళ్లు ఆ త‌ర్వాత క‌నుమ‌రుగైపోతారు. మంచి స‌క్సెస్ సాధించిన వాళ్లు కూడా కొన్నిసార్లు చిన్న చిన్న క్యారెక్ట‌ర్లకు ప‌రిమితం అయిపోతారు. గ్యాప్ ఇచ్చి సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన వాళ్ల‌కి అవ‌కాశాలు రావ‌డం కూడా క‌ష్ట‌మే అంటుంటారు సినీ వ‌ర్గాలు. అలా అప్ప‌ట్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన త‌మిళ‌న‌టి శ్రీ దివ్య ఇప్పుడు అక్క‌, చెల్లి క్యారెక్ట‌ర్ల‌కు ప‌రిమితం అవుతున్నార‌నే టాక్ గట్టిగా వినిపిస్తోంది. శ్రీ దివ్య కార్తి న‌టించ‌బోయే సినిమాలో.. చెల్లిగా చేస్తున్న‌ట్లు త‌మిళ ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


కార్తి చెల్లిగా శ్రీ దివ్య‌


'వరుత్త పడాద వాలిబర్‌ సంఘం' చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యింది శ్రీ‌దివ్య‌. తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ త‌మిళ ఇండ‌స్ట్రీలో ఫ‌స్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. కార్తీ, విష్ణు విశాల్‌, జీవీ ప్రకాష్‌కుమార్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల తెర‌పైన క‌నిపించ‌లేదు శ్రీ దివ్య‌. చాలా రోజులు గ్యాప్ తీసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా  విక్రమ్‌ప్రభు సరసన 'రైడ్‌' చిత్రంలో న‌టించింది. అయితే, ఆ సినిమా ఆశించినంత విజ‌యాన్ని ద‌క్కించుకోలేక పోయింది. అయితే, ఇప్పుడు కార్తీతో న‌టిస్తోంద‌ని స్వ‌యంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. షూటింగ్ మొద‌లైన త‌ర్వాత శ్రీ దివ్య పేరు బ‌య‌టికి రావ‌డంతో అందరూ ఆమెనే హీరోయిన్ అనుకున్నారు. కానీ, త‌ర్వాత ఆమెచెల్లిగా న‌టిస్తోంద‌నే వార్త బ‌య‌టికి రావ‌డంతో.. అభిమానులు తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు. ఇంతకు ముందు కూడా కార్తీ సరసన శ్రీ దివ్య ‘కాశ్మోరా’ చిత్రంలో నటించిన సంగతీ తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ, హీరో, హిరోయిన్ గా మాత్రం కాదు. 


కార్తీ 27.. 


వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న కార్తీ.. ప్ర‌స్తుతం త‌న 27వ సినిమా చేస్తున్నారు. 96 ద‌ర్శ‌కుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. దీన్ని నటుడు సూర్య, జ్యోతిక 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. సినిమాకి ఇంకా టైటిల్ ఖ‌రారు కాలేదు. షూటింగ్ మాత్రం శ‌ర‌వేగంగా న‌డుస్తోంద‌ని, కార్తీకి జంటగా స్వాతికొండే నటిస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం ఉండ‌బోతోంది. ఇటీవ‌ల కార్తీ న‌టించిన 'జ‌పాన్' సినిమాకి త‌మిళంలో మిశ్ర‌మ స్పంద‌న ల‌భించిన‌ప్ప‌టికీ తెలుగులో మంచి స్పంద‌నే వ‌చ్చింది. తమిళంలో ఈ చిత్రానికి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. 


శ్రీ‌దివ్య విష‌యానికి వ‌స్తే.. 'బస్ స్టాప్' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత 'కేరింత' సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే, తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్స్ రాలేదు. త‌మిళ్ లో మాత్రం ఎన్నో ఆఫ‌ర్లు చేజిక్కిచ్చుకుంది. ఇక ఈమె పెళ్లికి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు రూమర్స్ బ‌య‌టికి వ‌స్తూనే ఉంటాయి. కెరీర్ లో సెట్ అయిన త‌ర్వాతే పెళ్లి అంటూ చాలా సంద‌ర్భాల్లో చెప్పింది శ్రీ దివ్య‌. ఏదేమైనా చెల్లి క్యారెక్ట‌రా?  హీరోయినా? అనేది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది.  


Also Read: కిరాణ షాపుకు వెళ్లిన పాన్‌ ఇండియా స్టార్‌ యష్‌ - అక్కడ ఏం కొన్నాడో తెలుసా?