Motorola Latest Phone: మోటొరోలా తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ మోటొరోలా రేజర్ 50 అల్ట్రాని త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ యురేషియన్ ఎకనామిక్ కమిషన్ (EEC) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి రాబోయే వారాలు లేదా నెలల్లో ఈ ఫోన్‌ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు.


మోటొరోలా రేజర్ 50 అల్ట్రాని గతంలో లాంచ్ అయిన 40 అల్ట్రాకు చెందిన అప్‌గ్రేడ్ మోడల్‌గా లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈఈసీ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ XT2453-1తో లిస్ట్ అయిన మోటొరోలా స్మార్ట్‌ఫోన్‌ను 91మొబైల్స్ గుర్తించింది. ఇది గత సంవత్సరం లాంచ్ అయిన మోటొరోలా రేజర్ 40 అల్ట్రా మోడల్ నంబర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫోన్ క్లామ్‌షెల్ తరహా ఫోల్డబుల్ రూపంలో వస్తుందని లీక్ అయిన రెండర్ చూసి చెప్పవచ్చు.


మోటొరోలా రేజర్ 40 సిరీస్ స్పెషాలిటీ ఏమిటి?
మోటొరోలా రేజర్ 40 సిరీస్ గురించి చెప్పాలంటే... మోటొరోలా రేజర్ 40, 40 అల్ట్రాల్లో కంపెనీ 6.9 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది 144 హెర్ట్జ్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. కంపెనీ బేస్ మోడల్‌లో 1.47 అంగుళాల ఓఎల్ఈడీ కవర్ డిస్‌ప్లేను, టాప్ మోడల్‌లో 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది కాకుండా ప్రాసెసర్ గురించి చెప్పాలంటే టాప్ మోడల్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్  7 జెన్ 1 ప్రాసెసర్‌పై రన్ కానుంది.


మోటొరోలా రేజర్ 40లో మూడు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సేజ్ గ్రీన్, సమ్మర్ లైలాక్, వెనీలా క్రీమ్ ఉన్నాయి. ఇది కాకుండా 40 అల్ట్రా మెజెంటా, బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. రేజర్ 40 అల్ట్రాలో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉన్నాయి. ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. 30W వైర్డ్, 8W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 3,800 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?