Moto G22: మోటొరోలా త్వరలో మోటో జీ22 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు లాంచ్‌కు ముంగిట దీని స్పెసిఫికేషన్లు అన్నీ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీంతోపాటు ఈ ఫోన్ ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. దీని ప్రకారం ఈ ఫోన్ ధర యూరోప్‌లో 200 యూరోల రేంజ్‌లో (సుమారు రూ.17,020) ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే దీని ధర రూ.15 వేలలోపే ఉండే అవకాశం ఉంది.


మోటో జీ22 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉండనుంది. హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో ఈ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మాత్రమే ఇందులో అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో, డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే మోటొరోలా తన స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది.


మోటొరోలా ఇటీవలే మనదేశంలో మోటో ట్యాబ్ జీ70 ఎల్టీఈని లాంచ్ చేసింది. దీని ధరను రూ.21,999గా నిర్ణయించారు. ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. ఇందులో 11 అంగుళాల 2కే ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 15:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనవకైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7700 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 20W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!