ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు కూడా అవకాశాలు దక్కుతున్నాయి. హీరోయిన్లుగా చాలా సినిమాలే చేస్తున్నారు. ఓపక్క తెలుగులో సినిమాలు చేస్తూ.. మిగిలిన భాషల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. మన తెలుగమ్మాయిలకు తమిళ, మలయాళ సినిమాల్లో మంచి ఛాన్స్ లు వస్తుంటాయి. దీంతో తెలుగులో సినిమాలు లేకపోయినా.. పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు ఈషా రెబ్బ కూడా వేరే భాషల్లో నటిస్తోంది. 

 

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బ.. ఆ తరువాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటివరకు తెరపై ఎంతో పద్దతిగా కనిపించిన ఈషా.. ఇప్పుడు రొమాన్స్ ఘాటు బాగా పెంచేసింది. హాట్ ఫొటోషూట్ లలో పాల్గొనడమే కాదు.. సినిమాల్లో కూడా హాట్ సన్నివేశాలకు ఓకే చెప్పేస్తుంది. 

 

మలయాళంలో టాలెంటెడ్ హీరో కుంచకోబోబన్ సరసన 'ఒట్టు' అనే సినిమాలో నటిస్తోంది ఈషా. ఈ సినిమాను 'రెండగం' అనే టైటిల్ తో తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. అందులో ఈషా లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తూ కనిపించింది. ఈ సాంగ్ చూసిన తెలుగు ఆడియన్స్ అసలు ఈషాయేనా అంటూ షాక్ అవుతున్నారు. ఆ రేంజ్ లో రొమాన్స్ చేసింది ఈషా. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.