Secure Smartphones: గూగుల్, యాపిల్, శాంసంగ్‌తో సహా ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఎప్పటికప్పుడు తమ మొబైల్ ఫోన్‌లకు అదనపు సెక్యూరిటీ లేయర్‌లను జోడిస్తూ ఉంటారు. తద్వారా వినియోగదారుల ప్రైవసీని కాపాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్‌లు చాలా ఖరీదైనవి. ఆండ్రాయిడ్ ఫోన్‌ల కంటే ఐఫోన్‌ల్లో ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లు చాలా బలంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. చాలా మంది ఐఫోన్ కొనడానికి ఇదే మెయిన్ రీజన్. ఐఫోన్ కంటే మెరుగైన భద్రత కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ప్యూరిజం లిబ్రెం 5 (Purism Librem 5)
ఈ ఫోన్ ధర 999 డాలర్లుగా (సుమారు రూ. 83,300) ఉంది. లైనక్స్ ఆధారిత ప్యూర్ ఓఎస్‌పై ఈ డివైస్ పని చేస్తుంది. ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సంబంధిత కంట్రోల్స్‌ను అందిస్తుంది. దీని కారణంగా వాటిని ఎవరూ ట్రాక్ చేయలేరు. బ్లూటూత్, వైఫై, సెల్యులార్ సిగ్నల్స్ వంటి వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను డిజేబుల్ చేయడానికి ఫిజికల్ కిల్ స్విచ్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉండటం విశేషం. స్మార్ట్ ఫోన్‌లోని కెమెరా, మైక్రోఫోన్‌ను పూర్తిగా నిలిపివేయడానికి కూడా ఇది కిల్ స్విచ్‌తో వస్తుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


సిరిన్ ల్యాబ్స్ ఫిన్నే యూ1 (Sirin Labs Finney U1)
ఈ ఫోన్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 75,000). సిరిన్ ల్యాబ్స్ ఫిన్నే యూ1 అనేది ఒక సురక్షిత స్మార్ట్‌ఫోన్. ఇది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సైబర్ సెక్యూర్ బ్లాక్‌చెయిన్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ ఇదే అని కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టం (IPS) సపోర్ట్‌ను కలిగి ఉన్న గూగుల్ మాడిఫైడ్ ఆండ్రాయిడ్ వెర్షన్‌పై పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈ-మెయిల్స్‌కు రియల్ టైమ్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది.


బిట్టియం టఫ్ మొబైల్ 2 (Bittium Tough Mobile 2)
ఈ ఫోన్ ధర 1,729 డాలర్లుగా (సుమారు రూ. 1,44,500) నిర్ణయించారు. "New standard for ultra-secure mobile communications" అనే ట్యాగ్‌లైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫిన్‌లాండ్‌లో ఈ ఫోన్ తయారు అయింది. అత్యుత్తమ భద్రత, ట్యాంపర్ ప్రూఫ్ టెక్నాలజీని అందించే విధంగా నిపుణులు దీన్ని రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ కనెక్షన్ల కోసం హార్డ్‌వేర్ ఆధారిత ప్రైవసీ మోడ్‌ను కలిగి ఉంది. బిట్టియం సెక్యూర్ కాల్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది అమర్చబడింది. ఆడియో, వీడియో కాల్స్‌కు ఇది ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్ట్ చేయనుంది.


కటిమ్ ఆర్01 (Katim R01)
కటిమ్ ఆర్01 ధర 1,100 డాలర్లుగా (సుమారు రూ. 91,700) ఉంది. ఇది ఒక రఫ్ అండ్ టఫ్ ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌తో కూడిన సురక్షిత ప్రదేశంలో మొత్తం డేటాను నిల్వ చేస్తుంది. యూజర్ డేటాను యాక్సెస్ చేయాలంటే... పాస్‌కోడ్ లేదా ఫింగర్ ప్రింట్ తప్పని సరి. దీని USB ఇంటర్‌ఫేస్ మాల్వేర్... డేటా తెఫ్ట్ నుండి కూడా రక్షిస్తుంది. కటిమ్ ఆర్01 స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. 18:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న పెద్ద 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!