Upcoming Smartphones: భారతీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరిగింది. చాలా మంది కొత్త సంవత్సరంలో తమ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని కోరుకుంటారు. మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ వారం మార్కెట్లో చాలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కాబోతున్నాయి. ఇందులో వన్‌ప్లస్ నుంచి ఒప్పో వరకు చాలా టాప్ బ్రాండ్ల ఫోన్‌లు ఉన్నాయి.


వన్‌ప్లస్ 13 సిరీస్ (OnePlus 13 Series)
వన్‌ప్లస్ కొత్త 13 సిరీస్‌లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ సిరీస్ జనవరి 7వ తేదీన మార్కెట్లో లాంచ్ కానున్నాయి. లాంచ్ అయిన తర్వాత కస్టమర్లు అమెజాన్‌లో వాటిని కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ 14సీ (Redmi 14C)
రెడ్‌మీ తీసుకొస్తున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ జనవరి 6వ తేదీన లాంచ్ కానుంది. లాంచ్ అయిన తర్వాత దీన్ని ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారంల్లో కొనుగోలు చేయవచ్చు.


ఐటెల్ జెనో 10 (itel Zeno 10)
ఐటెల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ జనవరి 9వ తేదీన మార్కెట్లోకి రానుంది. లాంచ్ అయిన తర్వాత ఇది అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. 


ఒప్పో రెనో 13 సిరీస్ (Oppo Reno 13 Series)
ఒప్పో రెనో 13 సిరీస్‌లో ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ జనవరి 9వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు లాంచ్ కానుంది. వినియోగదారులు ఒప్పో అధికారిక వెబ్‌సైట్, Flipkart నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


మోటో జీ05 (Moto G05)
మోటొరోలా మోటో జీ05 జనవరి 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.


పోకో ఎక్స్7 సిరీస్ (Poco X7 Series)
పోకో ఎక్స్7 సిరీస్‌లో పోకో ఎక్స్7, పోకో ఎక్స్7 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉంటాయి. ఈ సిరీస్ జనవరి 9వ తేదీన భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్ తర్వాత ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.


ప్రత్యేకత ఏంటి?
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌లను కలిగి ఉంటాయి. ప్రతి బ్రాండ్ వివిధ బడ్జెట్‌లు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన ఫోన్‌ని డిజైన్ చేసింది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే వచ్చే వారం లాంచ్ కానున్న ఈ తొమ్మిది కొత్త ఫోన్‌లపై ఓ కన్నేసి ఉంచండి.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?