కొన్ని ఫోన్లు ఎండతో పనిలేకుండా.. సాధారణ రోజుల్లోనే హీటెక్కిపోతూ ఉంటాయి. అలాంటిది వేసవి వచ్చిందంటే.. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా, అలా నిత్యం హీటెక్కే ఫోన్లను జేబులో పెట్టుకుని.. ఎండలో తిరగడం కూడా డేంజరే. ప్రమాదవశాత్తు ఓవర్ హీటై పేలితే పరిస్థితిని ఊహించలేం. అందుకే, సమ్మర్‌లో తప్పకుండా మనం మన ఫోన్‌ను కూల్‌గా ఉంచేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, ఫోన్ చల్లగా ఉండాలంటే.. ఫ్రిజ్ లేదా, ఏసీ కింద పెడితే సరిపోతుంది కదా అనే అతి తెలివి ఆలోచనలు కూడా చాలామందికి వస్తాయి. అది మరింత డేంజర్. దానివల్ల కెమికల్ రియాక్షన్ జరిగి బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, సహజ పద్ధతిలోనే ఫోన్‌ను కూల్‌గా ఉంచుకొనేందుకు ప్రయత్నించాలి. 


ఫొటో వేడెక్కుతున్నట్లయితే.. మీ బ్యాటరీ త్వరగా తగ్గిపోతుంది. దానివల్ల స్విచ్ఛాఫ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. లేదా హీట్ వల్ల ఫోన్లోని అంతర్గత భాగాలు కాలిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఇది చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. అయితే, వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఫోన్ పనిచేయాలంటే కొన్ని చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో తెలుసుకోండి.


☀ చాలా ఫోన్‌లు ఎక్కువ వేడికి గురైతే ఆటోమేటిక్‌గా షట్ డౌన్ (స్విచ్ఛాఫ్) అవుతాయి. తిరిగి ఆన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి, సమ్మర్‌లో బయట తిరిగేప్పుడు మీ ఫోన్‌కు నేరుగా సూర్యకాంతి తగలకుండా జాగ్రత్తపడండి. 
☀ వేసవిలో కార్లు కూడా చాలా హీటెక్కి ఉంటాయి. అలాంటి కార్లలో ఫోన్లు వదిలేయడం చాలా డేంజర్.
☀ వేసవిలో నేరుగా ఎండలో పార్క్ చేసిన కారు లోపలి భాగం 150 డిగ్రీల ఫారిన్ హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకుంటుంది. కాబట్టి, కార్లో ఫోన్ వదలడం సేఫ్ కాదు.
☀ చాలా మంది ఫోన్ తయారీదారులు మీ ఫోన్‌ను వేడి కారులో ఉంచవద్దని సిఫార్సు చేస్తున్నారు.  
☀ యాపిల్ వంటి ఫోన్లు -4 డిగ్రీల నుంచి 113 డిగ్రీల F మధ్య ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకోగలవట. 
☀ మీరు మీ ఫోన్‌కు కవర్ లేదా, కేస్ వాడుతున్నట్లయితే తీసేయండి. దానివల్ల బ్యాటరీ లేదా ఇతర ఫోన్ భాగాలు హీటెక్కవచ్చు. 
☀ చవకైనా బ్యాటరీలు, ఛార్జర్లను అస్సలు వాడొద్దు. కేవలం బ్రాండెడ్‌వి మాత్రమే ఉపయోగించండి. 
☀ కేవలం ఫోన్ కంపెనీ అందించే ఛార్జర్లను మాత్రమే ఉపయోగించండి.


గేమ్స్, వీడియోలు చూసే అలవాటు ఉంటే?


మీరు ఫోన్లో వీడియోలు, గేమ్స్ ఎక్కువ ఆడుతున్నట్లయితే ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరిగి మరింత హీటెక్కుతుంది. అలాంటి సమయంలో ఈ చిట్కాల ద్వారా ఫోన్‌ను హీటెక్కకుండా జాగ్రత్తపడొచ్చు. 


☀ ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆన్ చేయండి
☀ అనవసరమైన యాప్‌లను మూసివేయండి
☀ స్క్రీన్ ప్రకాశాన్ని తగ్గించండి
☀ పవర్ సేవ్ మోడ్ లేదా తక్కువ బ్యాటరీ మోడ్‌ను ఆన్ చేయండి
☀ మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యాప్‌లను అప్‌డేట్ చేయండి


Also Read: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? - ఎంత ర్యామ్ ఉన్న ఫోన్ అయితే బెటర్!


ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా మీ ఫోన్ వేడెక్కుతున్నట్లయితే.. మొబైల్ ఫోన్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం ఉత్తమం. ఎందుకంటే.. వారు మాత్రమే సమస్య ఎక్కడ ఉందనేది కచ్చితంగా అంచనా వేయగలరు. బ్యాటరీ లేదా, ఫోన్లో ఇతర భాగాల్లో ఏమైనా లోపాలున్నా ఈ హీటింగ్ సమస్య నిరంతరాయంగా ఉండవచ్చు. మీ ఫోన్ బాగా పాతదైనా సరే, హీటింగ్ సమస్యలు వస్తాయి.